న్యూఢిల్లీ : ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు బయల్దేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఊహించని విధంగా వెనుతిరిగింది. మార్గమధ్యలో జమ్ములో ఆగాల్సి ఉన్నా, అక్కడ ల్యాండ్ కాకుండానే తిరిగి ఢిల్లీకి చేరుకుంది. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి బయల్దేరిన ఎయిరిండియా విమానం జమ్ము విమానాశ్రయానికి చేరుకున్నా.. విమానం ల్యాండ్ కాలేదని అధికారులు తెలిపారు. విమానం జీపీఎస్ వ్యవస్థలో అనుమానాస్పద జోక్యం వల్ల విమానం వెనక్కి మరలిందని ఎయిరిండియా అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.
రన్‌వేపై వెళ్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించటంతో, జైపూర్ నుంచి దుబాయ్‌కు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం సోమవారం రద్దయ్యింది.