e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News బడాయూ ఎంపీ సంఘమిత్ర మౌర్య ఫేస్‌బుక్ ఐడీ హ్యాక్‌

బడాయూ ఎంపీ సంఘమిత్ర మౌర్య ఫేస్‌బుక్ ఐడీ హ్యాక్‌

బడాయూ ఎంపీ సంఘమిత్ర మౌర్య ఫేస్‌బుక్ ఐడీ హ్యాక్‌

ల‌క్నో : బడాయూ పార్ల‌మెంట్ స‌భ్యురాలు సంఘమిత్ర మౌర్య ఫేస్‌బుక్ ఐడీని కొంద‌రు గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు హ్యాక్ చేశారు. అనంత‌రం ఆమె పేజీపై అభ్యంత‌ర‌కర వ్యాఖ్యలు రాశారు. దీనిపై ఎంపీ సంఘ‌మిత్ర మౌర్య గౌతంప‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా. .సైబ‌ర్ క్రైం పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈమె పేరిట మ‌రో ఐడీని కూడా సృష్టించిన‌ట్లు గుర్తించారు.

స్థానిక కార్మిక మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య కుమార్తె కూడా అయిన ఎంపీ సంఘమిత్ర మౌర్యకు చెందిన ఫేస్‌బుక్ ఐడీని సైబర్ మోసగాళ్లు హ్యాక్ చేశారు. ఆమె పేరిట మరో ఐడిని సృష్టించారు. సంఘ‌మిత్ర పేజీలో అభ్యంతరకరంగా పోస్టులు చేశారు. ఎంపీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు హ్యాక‌ర్లు ప్రయత్నించిన‌ట్లుగా తెలుస్తున్న‌ది. ఫేస్‌బుక్ ఐడీ ఐపీ అడ్రస్ ఆధారంగా హ్యాకర్‌ను కనిపెట్టడానికి సైబర్ క్రైం సెల్ బృందం ప్రయత్నిస్తున్న‌ది. ప‌లు పోలీసు బృందాలు ఈ ప‌నిలో నిమ‌గ్న‌మై ఉన్నాయని ఇన్‌స్పెక్టర్ గౌతంపల్లి అనూప్ సింగ్ వెల్ల‌డించారు. వీలైనంత త్వ‌ర‌గా హ్యాక‌ర్‌ను ప‌ట్టుకుంటామ‌ని, సైబ‌ర్ మోస‌గాళ్ల‌కు చిక్క‌కుండా ప్ర‌జ‌లంతా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆయ‌న సూచ‌న చేశారు.

ఇలాఉండ‌గా, ఓ రైల్వే కార్మికుడి ఖాతా నుంచి పెద్ద‌మొత్తంలో న‌గ‌దును సైబ‌ర్ నేర‌గాళ్లు దోచుకున్నారు. స్థానిక‌ రైల్వే కాలనీలో నివసించే రైల్వే కార్మికుడి ఖాతా నుంచి సైబర్ మోసగాళ్ళు రూ.74 వేలు దోచుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్ద మొత్తంలో న‌గ‌దు విత్‌డ్రా చేసిన‌ట్లు త‌న ఫోన్‌కు స‌మాచారం రావ‌డంతో ఆ కార్మికుడు పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు.

ఇవి కూడా చ‌ద‌వండి..

దీదీ కోసం నా సీటును వ‌దులుకుంటా : ఎమ్మెల్యే ర‌త్నా ఛ‌ట‌ర్జీ

యూపీలో కరోనా కర్ఫ్యూ మే 17 వరకు పొడ‌గింపు

క్రికెట్ ఆడే ఏనుగును ఎక్క‌డైనా చూశారా..? .. వీడియో వైర‌ల్‌

మొట్ట‌మొద‌టి బ‌ర్త్ కంట్రోల్ పిల్‌కు ఆమోదం.. చ‌రిత్ర‌లో ఈరోజు

Mother’s day special: అమ్మ కోసం ఐదు బహుమతులు

దేశంలోనే తొలి బ్రీత్ బ్యాంక్ ప్రారంభం.. ఎక్క‌డంటే..!

ఆర్టికల్ 370 తొలగింపు భారత్‌ అంతర్గత విషయం: మహమూద్ ఖురేషి

క‌రోనా వేళ ఖ‌రీదవుతున్న ఆహారాలు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బడాయూ ఎంపీ సంఘమిత్ర మౌర్య ఫేస్‌బుక్ ఐడీ హ్యాక్‌

ట్రెండింగ్‌

Advertisement