e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News Mother's day special: అమ్మ కోసం ఐదు బహుమతులు

Mother’s day special: అమ్మ కోసం ఐదు బహుమతులు

Mother's day special: అమ్మ కోసం ఐదు బహుమతులు

అమ్మ‌ను మించిన దైవం ఉండ‌దు.. పుట్టిన‌ప్ప‌టి నుంచి పెరిగి పెద్ద‌యి ప్ర‌యోజ‌కులుగా మారే దాకా మ‌న‌ల్ని కంటికి రెప్ప‌లా కాపాడుతుంది. ఇందుకోసం ఆమె జీవితంలో ఎన్నో త్యాగాల‌ను చేస్తుంది. అలాంటి త‌ల్లి సేవ‌ల‌కు గుర్తుగా ఆమెను గౌర‌వించ‌డం విధి. ఇందుకోసం ప్ర‌తి ఏడాది మే రెండో ఆదివారం నాడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌ద‌ర్స్ డే ( మాతృదినోత్స‌వం ) జ‌రుపుకొంటున్నారు. మ‌న‌ల్ని ఎంత‌గానో ప్రేమించే అమ్మను ఈ రోజున గౌర‌వించ‌డం ఒక కొడుకుగా, కూతురిగా మ‌న బాధ్య‌త‌.

అమ్మ ప‌ట్ల మ‌న‌కు ఉన్న ప్రేమ‌ను చాటుకోవ‌డానికి ఇంతక‌న్నా మంచి త‌రుణం ఇంకోటి ఉండ‌దు. అందుక‌ని మిమ్మ‌ల్ని ఎంత‌గానో ప్రేమించే త‌ల్లికి బ‌హుమ‌తి ఇవ్వాల‌ని అనుకుంటున్నారా? అయితే రెగ్యుల‌ర్‌గా ఇచ్చే బ‌హుమ‌తులు కాకుండా కాస్త డిఫ‌రెంట్‌గా ఆలోచించండి.. కొద్ది రోజులు మాత్ర‌మే ఉండే తాత్కాలిక గిఫ్టులు ఇచ్చే బ‌దులు జీవితాంతం వారికి ఆర్థికంగా చేదోడు అందించే స్పెష‌ల్ గిఫ్టుల‌పై దృష్టి పెట్ట‌మ‌ని స‌ల‌హాలు ఇస్తున్నారు ఆర్థిక నిపుణులు. ఈ ఐదు బ‌హుమతులు మీ త‌ల్లికి ఆర్థికంగా ఎంతో మేలు చేస్తాయ‌ని చెబుతున్నారు.

గోల్డ్ బాండ్స్

బంగారానికి బదులుగా బంగారు బాండ్లు ఎంతో మంచివ‌ని చెప్పాల్సిన ప‌నిలేదు. మీరు నిజమైన రాబడి రేటు కోసం చూస్తున్నట్లయితే పెట్టుబడి పెట్టడానికి గోల్డ్ బాండ్స్ మంచి మార్గం. సావరిన్ గోల్డ్ బాండ్ పథకం ప్రకారం, అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఎవరికైనా బాండ్లను బహుమతిగా లేదా బదిలీ చేయవచ్చు. అందుక‌ని, మదర్స్ డే రోజున అమ్మ‌కు గోల్డ్ బాండ్స్ మంచి బ‌హుమ‌తిగా ఉండ‌గ‌ల‌వు.

ఆరోగ్య బీమా

అమ్మ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా సంతోషంగా ఉంటుందవి. అందుకే అమ్మ‌కు ఆరోగ్య బీమాను అందించ‌డంపై దృష్టిసారించాలి. ఆమెకు ఆర్ధికంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా.. అవసరమైనప్పుడు ఉత్తమమైన వైద్య సేవ‌ల‌ను ఇది అందిస్తుంది. అనేక బీమా ప్రొవైడర్లు కుటుంబంలోని సీనియర్ సభ్యులను చేర్చడానికి ప్రత్యేకంగా ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్‌కేర్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. చాలా కంపెనీలు ఇప్పుడు సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మెడిక్లైమ్ పాలసీతో వస్తున్నాయి. వీటిలో ఏదో ఒక‌దాన్ని ఎంచుకుని మ‌ద‌ర్స్ డే నాడు అమ్మ‌కు మంచి బ‌హుమ‌తిగా ఇవ్వ‌వ‌చ్చు.

సీనియర్ సిటిజెన్ సేవింగ్ స్కీమ్స్

60 ఏండ్ల‌కు పైబడినవారైతే.. సీనియర్ సిటిజెన్ సేవింగ్ స్కీమ్స్ (ఎస్సీఎస్ఎస్) ప్రయోజనాలను కూడా బహుమతిగా ఇవ్వవచ్చు. ఎస్సీఎస్ఎస్‌ అనేది ప్రభుత్వ మద్దతుగల పొదుపు స్కీం . ఇది సంవత్సరానికి 7.40 శాతం వ‌డ్డీ అందిస్తుంది. ఖాతా తెరిచిన తేదీ నుంచి ఐదేండ్ల‌ తర్వాత డిపాజిట్ చేతికి వస్తుంది. అదనంగా మూడేండ్లు పొడిగించుకోవచ్చు. అయితే, ఎస్సీఎస్‌ఎస్‌లో పెట్టుబడులు పెట్టడానికి అప్ప‌ర్‌ లిమిట్ రూ.15 లక్షలు. త్రైమాసిక ప్రాతిపదికన అధిక స్థిర రాబడి, సాధారణ ఆదాయం కోసం చూస్తున్న సీనియర్ సిటిజన్లకు ఎస్సీఎస్ఎస్ బాగా సూట‌వుతుంది. ఎస్సీఎస్‌ఎస్‌లో పెట్టుబడులు 1961 ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ కింద సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపుకు అర్హులు.

స్టాక్స్ / మ్యూచువల్ ఫండ్స్

మీ అమ్మ‌కు పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి ఉన్న‌ట్ల‌యితే.. ఆమెకు ఇష్టమైన కంపెనీలో మీరు కొంత ఇన్వెస్ట్‌ చేయొచ్చు. మంచి నాణ్యత గల ఈక్విటీ స్టాక్స్ భవిష్యత్‌లో అధిక రాబడిని ఇవ్వగలవు. మీరు వాటాలను నేరుగా గ్రహీత డీమాట్ ఖాతాకు బదిలీ చేయడం ద్వారా బహుమతి అందించ‌వచ్చు. గ్రహీత సంబంధిత వివరాలతో రశీదు సూచనలను నింపి తన డిపాజిటరీ పార్టిసీపెంట్‌కు సమర్పించాలి.

మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు బదిలీ చేయబడవు. అందుకుని, మ్యూచువ‌ల్ ఫండ్స్‌ లను బహుమతిగా ఇవ్వడానికి బ‌దులుగా మ్యూచువల్ ఫండ్ యూనిట్లను రీడీమ్‌ చేయండి. వచ్చే ఆదాయాన్ని మదర్స్ డే రోజున అమ్మ‌కు బహుమతిగా ఇవ్వండి. లేదా ఆ నిధులను ఆమె ఖాతాకు బదిలీ చేయండి. ఆమె తరపున మ‌రింత ఇన్వెస్ట్‌మెంట్‌ చేయండి.

ఆర్థిక నిపుణుల సాయం

అమ్మ‌కు ఆర్థిక సలహాలు, సూచనలో కోసం ఆర్థిక నిపుణుడిని పరిచయం చేయండి. డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్‌ చేయాలి.. పదవీ విరమణ తర్వాత వచ్చే డబ్బును పెట్టుబడి పెట్టాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల్లో నిపుణుల సలహాలు, సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయి.

ఇవి కూడా చ‌ద‌వండి..

యురోపియన్ స‌ద‌స్సుకు హాజ‌రైన ప్ర‌ధాని మోదీ

25 సార్లు ఎవ‌రెస్ట్ ఎక్కాడు.. కొత్త రికార్డు నెల‌కొల్పాడు..

దేశంలోనే తొలి బ్రీత్ బ్యాంక్ ప్రారంభం.. ఎక్క‌డంటే..!

ఆర్టికల్ 370 తొలగింపు భారత్‌ అంతర్గత విషయం: మహమూద్ ఖురేషి

చేతులు క‌లుపనున్న అగ్ర‌రాజ్యాలు.. పుతిన్‌కు బైడెన్ ఆహ్వానం

పాకిస్తాన్‌లో అసిస్టెంట్ క‌మిష‌న‌ర్‌గా హిందూ యువ‌తి

క‌రోనా వేళ ఖ‌రీదవుతున్న ఆహారాలు

జూలై కల్లా ముగియ‌నున్న క‌రోనా సెకండ్ వేవ్ : ఐఐటీ కాన్పూర్ ప‌రిశోధ‌కులు

ఐరోపాలో ముగిసిన రెండో ప్ర‌పంచ యుద్ధం.. చ‌రిత్ర‌లో ఈరోజు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
Mother's day special: అమ్మ కోసం ఐదు బహుమతులు

ట్రెండింగ్‌

Advertisement