e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home News ఐరోపాలో ముగిసిన రెండో ప్ర‌పంచ యుద్ధం.. చ‌రిత్ర‌లో ఈరోజు

ఐరోపాలో ముగిసిన రెండో ప్ర‌పంచ యుద్ధం.. చ‌రిత్ర‌లో ఈరోజు

ఐరోపాలో ముగిసిన రెండో ప్ర‌పంచ యుద్ధం.. చ‌రిత్ర‌లో ఈరోజు

జర్మనీ లొంగిపోయిన అనంత‌రం రెండో ప్రపంచ యుద్ధం ఐరోపాలో 1945 లో స‌రిగ్గా ఇదే రోజున‌ ముగిసింది. దీనిని పుర‌స్క‌రించుకుని ఇప్ప‌టికీ ఐరాపావాసులు.. యూరప్ డే విజయాన్ని జ‌రుపుకుంటారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి ఈ రోజుకు స‌రిగ్గా 76 సంవ‌త్స‌రాలు పూర్త‌య్యాయి. ఐరోపాలో చాలా దేశాలు కరోనావైరస్ పట్టులో ఉన్నందున ఈ సంవత్సరం త‌క్కువ‌గా జ‌రిపేందుకు నిర్ణ‌యించారు. 1939 నుంచి 1945 వరకు కొనిసాగిన ఈ రెండో ప్ర‌పంచ యుద్ధాన్ని.. ప్రపంచంలోని అనేక దేశాల నడుమ ఏక కాలంలో ఉమ్మడిగా, విడివిడిగా జరిగిన అనేక యుద్ధాల సమాహారంగా చెప్పుకోవ‌చ్చు.

మే 8 న రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ నాజీ సైన్యం ఓడిపోవడంతో యుద్ధం ముగిసిన‌ట్లు ప్ర‌క‌టించారు. జర్మనీ నాజీ సైన్యం ఆరు సంవత్సరాల సుదీర్ఘ యుద్ధం తర్వాత బ్రిటన్, సంకీర్ణ దళాలకు బేషరతుగా లొంగిపోయింది. అయితే, 1945 సెప్టెంబర్ 2 న‌ అధికారికంగా రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన‌ట్లుగా పరిగణ‌లోకి తీసుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో కనీసం 50 మిలియన్ల మంది మరణించారని అంచనా. అందులో 25 మిలియన్ల మంది సోవియట్ ఆర్మీ సైనికులు, పౌరులు ఉండ‌టం గ‌మ‌నార్హం.

1945లో మిత్ర రాజ్యాల కూటమికి నాయకత్వం వహించిన అమెరికా సంయుక్త రాష్ట్రాలు, సోవియట్ సమాఖ్య యుద్ధానంతర కాలంలో ప్రపంచంలో రెండు అగ్ర రాజ్యాలుగా ఎదిగి ఒకరితో ఒకరు ప్రచ్ఛన్న యుద్ధానికి తలపడ్డాయి. ఈ ప్రచ్ఛన్న యుద్ధం దాదాపు 45 సంవత్సరాల పాటు కొనసాగి, 1990లో సోవియట్ సమాఖ్య పతనంతో అంతమైంది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం అటువంటి మరో యుద్ధాన్ని నివారించే ఆశయంతో ఐక్య రాజ్య సమితిని నెలకొల్పారు.

మ‌రికొన్ని ముఖ్య సంఘ‌ట‌న‌లు..

2018: ఇరాన్ అణు ఒప్పందం నుంచి నిష్క్రమించినట్లు ప్రకటించిన అమెరికా

2010: ఛత్తీస్‌గఢ్‌లోని బీజపూర్-భోపాల్‌పట్నం జాతీయ రహదారిపై సీఆర్‌పీఎఫ్ వాహనాన్ని ల్యాండ్‌మైన్‌తో పేల్చివేసిన న‌క్స‌లైట్లు, ఎనిమిది మంది సైనికులు దుర్మ‌ర‌ణం

1984 : లాస్ ఏంజిల్స్ ఒలంపిక్స్‌ను బ‌హిష్క‌రించిన ర‌ష్యా

1980: మశూచి నిర్మూలనను ప్ర‌క‌టించిన‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ

1933: బ్రిటిష్ పాలన విధానాలకు వ్యతిరేకంగా 21 రోజుల ఉపవాసం ప్రారంభించిన మహాత్మా గాంధీ

1828: మానవ సేవ కోసం చేసిన మొదటి నోబెల్ శాంతి బహుమతిని హెన్రీ డ్యూయెంట్‌కు ప్ర‌క‌ట‌న‌

1794 : ఆక్సిజ‌న్‌, హైడ్రోజ‌న్‌ను క‌నిపెట్టిన స్వీడ‌న్ శాస్త్ర‌వేత్త కార్ల్ విల్హెల్మ్ షీలే క‌న్నుమూత‌

ఇవి కూడా చ‌ద‌వండి..

బెంగాల్ స్పీక‌ర్‌గా బిమ‌న్ బెన‌ర్జి.. వ‌రుస‌గా మూడోసారి ఎంపిక‌..!

మార్స్‌పై నాసా హెలికాప్ట‌ర్ చక్క‌ర్లు.. తొలిసారి ఆడియో కూడా రికార్డ్‌.. వీడియో

ఆగస్టు నాటికి బ్రిటన్‌లో కరోనా అంతం

కోవిడ్‌తో ఊపిరితిత్తులే కాదు.. రక్తనాళాలకూ సమస్యే

చైనా సినోఫార్మ్‌ వ్యాక్సిన్‌కు WHO అనుమతి

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఐరోపాలో ముగిసిన రెండో ప్ర‌పంచ యుద్ధం.. చ‌రిత్ర‌లో ఈరోజు

ట్రెండింగ్‌

Advertisement