Kuwait airport | కువైట్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ డ్రోన్ దాడి.. వీడియో విడుదల
Kuwait airport : కువైట్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ బుధవారం డ్రోన్ దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 67 మంది గాయపడగా, ఒక భారతీయుడు మరణించాడు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1పై ఇరాన్ డ్రోన్‌తో దాడి చేసింది.
Kuwait airport : కువైట్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ బుధవారం డ్రోన్ దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 67 మంది గాయపడగా, ఒక భారతీయుడు మరణించాడు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1పై ఇరాన్ డ్రోన్‌తో దాడి చేసింది. ఈ ఘటనతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
మరోవైపు ఎయిర్‌పోర్టుకు కూడా భారీ నష్టం సంభవించింది. రూఫ్‌టాప్ కూలిపోయింది. గాయపడిన వారిలో విమాన ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ఎయిర్‌పోర్టుపై దాడి జరగడంతో విమాన సర్వీసుల్ని నిలిపివేస్తూ ఎయిర్పోర్ట్ అథారిటీ నిర్ణయం తీసుకుంది. పలు అంతర్జాతీయ విమానాల్ని ఇతర విమానాశ్రయాలకు ళ్లించారు. ఇరాన్ డ్రోన్ దాడి ఘటనతో భారీ పేలుడు సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడ్డాయి. పొగ చాలా దూరం వరకు అల్లుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కువైట్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తన ఎక్స్ ఖాతాలో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
اللحظات الأولى للاعتداء الإيراني الغاشم من قبل المسيرات الذي تعرض له مبنى الركاب T1 في مطار الكويت الدولي بتاريخ 3 يونيو 2026 وتسبب بخسائر بالأرواح وإصابات بشرية بليغة وأضرار مادية جسيمة
The first moments following the brutal Iranian drone attack on Terminal 1 (T1) at Kuwait… pic.twitter.com/eTzQoVXB4K
— الطيران المدني (@Kuwait_DGCA) June 3, 2026
మరోవైపు ఈ దాడి తాము ఉద్దేశపూర్వకంగా చేయలేదని ఇరాన్ వెల్లడించింది. ఇది ఇరాన్ డ్రోన్‌ను అమెరికా మిస్సైల్స్ అడ్డుకునే క్రమంలో అది ఎయిర్‌పోర్టుపై పడి దాడి జరిగిందని తెలిపింది. ఈ దాడి ఘటనను కువైట్ ఖండించింది. దీన్ని ఒక క్రిమినల్ చర్యగా అభివర్ణించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- drone
- iran
- Kuwait airpor
- US
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

