కోవిడ్‌తో ఊపిరితిత్తులే కాదు.. రక్తనాళాలకూ సమస్యే
కోవిడ్ | కోవిడ్ అనగానే అదేదో ఊపిరితిత్తుల జబ్బు అనుకుంటున్నారు. కానీ తీవ్రస్థాయిలో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదమూ ఉంటుందని నిపుణులు

న్యూఢిల్లీ: కోవిడ్ అనగానే అదేదో ఊపిరితిత్తుల జబ్బు అనుకుంటున్నారు. కానీ తీవ్రస్థాయిలో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదమూ ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో శరీరభాగాల్ని కాపాడేందుకు తక్షణమే ఆ క్లాట్స్ ను తొలగించాల్సి రావచ్చునని అంటున్నారు. కోవిడ్ రోగుల్లో కండరాల్లో లోతుగా ఉండే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే అవకాశం 14-28 శాతం, పైన ఉండే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే అవకాశం 2-5 శాతం ఉంటుందని అంతర్జాతీయ అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఈ జబ్బు ఊపిరితిత్తుల ఎంతగా పనిచేస్తుందో రక్తనాళాల మీద కుడా అంతే పని చేస్తుందని భారత్ అనుభవం రుజువు చేసింది. సగటున వారానికి ఇలాంటివి ఐదారు కేసులు వస్తున్నాయి. ఈ వారం రోజుకొకటి వస్తున్నాయని ఢిల్లీ సర్ లగంగారాం హాస్పిటల్ వాస్కులర్, ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ అంబరీశ్ సాత్విక్ చెప్పారు. ఆయన ఓ రోగి క్లాట్స్ నమూనాతో తయారు చేసిన క్యాస్టింగ్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు. టైప్-2 డయాబెటిస్ ఉన్న కోవిడ్ రోగుల్లో రక్తనాళాల సమస్య ఎక్కువగా కనిపిస్తున్నదని, ఇలా ఎందుకు జరుగుతున్నదనే విషయమై ఇంకా లోతుగా తెలియదని ఆకాశ్ హెల్త్‌కేర్ హాస్పిటల్ కార్డియో థొరాసిక్ వాస్కులర్ డిపార్టుమెటు అధిపతి డాక్టర్ అమ్రిశ్ కుమార్ అన్నారు. అయితే డయాబెటిక్స్ మాత్రమే కాకుండా చాలామంది రోగుల్లో ఊపిరితిత్తుల రక్తనాళాల్లో ముద్దలు కనిపించడం గమనార్హం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

