యూపీలో కరోనా కర్ఫ్యూ మే 17 వరకు పొడగింపు
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఈ నెల 17 వరకు పొడగించారు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది

లక్నో : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఈ నెల 17 వరకు పొడగించారు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. మే 14 న పంచాయతీ ఎన్నికలు, అనంతరం రంజాన్ పండుగ తర్వాత గ్రామాల్లో వ్యాప్తి చెందకుండా ఉండేందుకు లాక్‌డౌన్‌ను పొడగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తొలుత ఏప్రిల్ 29 న వారాంతపు బంద్ చేపట్టారు. తర్వాత దానిని మే 4, మే 6 వరకు, ఆ తర్వాత మే 10 వరకు పొడగించారు. ఇప్పుడు యోగి ప్రభుత్వం మళ్ళీ కరోనా కర్ఫ్యూను మే 17 న ఉదయం 7 గంటల వరకు పొడిగించింది.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ టీం -9 తో ఆదివారం జరిపిన సమీక్ష సమావేశంలో లాక్డౌన్ కొనసాగించాలని నిర్ణయించారు. కరోనా ఇన్ఫెక్షన్ చైన్‌ను విచ్ఛిన్నం చేయడానికి కరోనా కర్ఫ్యూను మరోసారి మే 17 న ఉదయం ఏడు గంటల వరకు పొడిగించారు. ఈ సమయంలో అన్ని ఆంక్షలు మునుపటిలాగే అమలులో ఉంటాయని, అవసరమైన సేవలకు మినహాయింపు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. అనవసరంగా రోడ్లపై తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని వారు చెప్పారు. ప్రోటోకాల్‌ను కచ్చితంగా అమలు చేస్తేనే కరోనా కర్ఫ్యూ ప్రయోజనం విజయవంతమవుతుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
క్రికెట్ ఆడే ఏనుగును ఎక్కడైనా చూశారా..? .. వీడియో వైరల్
మొట్టమొదటి బర్త్ కంట్రోల్ పిల్‌కు ఆమోదం.. చరిత్రలో ఈరోజు
Mother’s day special: అమ్మ కోసం ఐదు బహుమతులు
25 సార్లు ఎవరెస్ట్ ఎక్కాడు.. కొత్త రికార్డు నెలకొల్పాడు..
దేశంలోనే తొలి బ్రీత్ బ్యాంక్ ప్రారంభం.. ఎక్కడంటే..!
ఆర్టికల్ 370 తొలగింపు భారత్ అంతర్గత విషయం: మహమూద్ ఖురేషి
చేతులు కలుపనున్న అగ్రరాజ్యాలు.. పుతిన్‌కు బైడెన్ ఆహ్వానం
కరోనా వేళ ఖరీదవుతున్న ఆహారాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

