దీదీ కోసం నా సీటును వదులుకుంటా : ఎమ్మెల్యే రత్నా ఛటర్జీ
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోసం తన సీటును వదులుకునేందుకు సిద్ధమని ఎమ్మెల్యే రత్నా ఛటర్జీ వెల్లడించారు. ఆమె కోసం ఈ మాత్రం త్యాగం చేయలేమా? అని ఎదురు ప్రశ్న వేశారామె.

కోల్‌కతా: ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోసం తన సీటును వదులుకునేందుకు సిద్ధమని ఎమ్మెల్యే రత్నా ఛటర్జీ వెల్లడించారు. ఆమె కోసం ఈ మాత్రం త్యాగం చేయలేమా? అని ఎదురు ప్రశ్న వేశారామె. బెహాలా ఈస్ట్ నుంచి టీఎంసీ పార్టీ టిక్కెట్‌పై ఎమ్మెల్యేగా రత్నా ఛటర్జీ విజయం సాధించింది. ఈమె కోల్‌కతా మాజీ మేయర్ సోవాన్ ఛటర్జీ భార్య. ప్రస్తుతం వీరు వేరుగా ఉంటున్నారు.
నందిగ్రామ్‌లో ఓటమి ఎదురైనప్పటికీ, మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం రానున్న ఆరు నెలల్లో అసెంబ్లీకి మమత బెనర్జీ ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో ఏ ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి తమ సీటును ఖాళీ చేస్తారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోల్‌కతా మాజీ మేయర్ సోవాన్ ఛటర్జీ భార్య రత్నా ఛటర్జీ తన స్థానం నుంచి మమతా బెనర్జీని నిలిపి గెలిపించుకుంటామని స్పష్టంచేశారు. దీదీ చెబితే సంతోషంగా తన సీటును వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని రత్న చెప్పారు.
వాస్తవానికి, రత్న భర్త సోవన్ ఛటర్జీ ఎన్నికల సమయలో బీజేపీలో చేరారు. అయితే బీజేపీలో ఆయనకు టికెట్ లభించలేదు. దాంతో ఆయన తన స్నేహితురాలు బైసాకి బెనర్జీతో కలిసి పార్టీకి రాజీనామా చేశాడు. ఇప్పుడు మమతా బెనర్జీ పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో.. సోవన్ ఛటర్జీ, బైసాకి బెనర్జీ ఇద్దరూ తిరిగి తృణమూల్ పార్టీకి రావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తృణమూల్‌కు తిరిగి వస్తున్నారా అని సోవాన్ను ప్రశ్నించగా.. విడాకుల కేసుతో పోరాడుతున్న తన భార్య రత్న తృణమూల్‌లో ఉన్నంత కాలం తాను ఆ పార్టీలోకి తిరిగి వెళ్లలేనని చెప్పాడు.
తాను ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినందున నన్ను పార్టీ నుంచి తరిమికొట్టలేరని, పార్టీని వీడే ప్రశ్నే తలెత్తదని రత్నా ఛటర్జీ స్పష్టం చేశారు. సోవాన్, బైసాకి తృణమూల్‌కు తిరిగి వచ్చే అవకాశం గురించి ప్రశ్నించగా సమాధానం ఇవ్వకుండా దాటవేశారు.
ఇవి కూడా చదవండి..
యూపీలో కరోనా కర్ఫ్యూ మే 17 వరకు పొడగింపు
క్రికెట్ ఆడే ఏనుగును ఎక్కడైనా చూశారా..? .. వీడియో వైరల్
మొట్టమొదటి బర్త్ కంట్రోల్ పిల్‌కు ఆమోదం.. చరిత్రలో ఈరోజు
Mother’s day special: అమ్మ కోసం ఐదు బహుమతులు
25 సార్లు ఎవరెస్ట్ ఎక్కాడు.. కొత్త రికార్డు నెలకొల్పాడు..
దేశంలోనే తొలి బ్రీత్ బ్యాంక్ ప్రారంభం.. ఎక్కడంటే..!
ఆర్టికల్ 370 తొలగింపు భారత్ అంతర్గత విషయం: మహమూద్ ఖురేషి
చేతులు కలుపనున్న అగ్రరాజ్యాలు.. పుతిన్‌కు బైడెన్ ఆహ్వానం
కరోనా వేళ ఖరీదవుతున్న ఆహారాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో గెలిచిన మేయర్లు, చైర్పర్సన్ల ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే ?
Jairam Ramesh | రాముడి పేరుతో పాపాలు ఇంకెన్నాళ్లు..? బీజేపీపై జైరాం రమేష్ ఆగ్రహం
Talasani Srinivas Yadav | ఆర్జేడీ నేత తేజస్విప్రసాద్ యాదవ్, ఎస్పీ నేతలకు తలసాని స్వాగతం.. వీడియో
cop caught in woman’s home | అర్ధరాత్రి వేళ మహిళ ఇంట్లో పోలీస్ అధికారి.. చుట్టుముట్టిన గ్రామస్తులపై కాల్పులు, ఒకరు మృతి
అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

