Rain Red Alert | రుతుపవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రను కూడా భారీ వర్షం ముంచెత్తింది. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు జిల్లాలు పూర్తిగా జలమయమయ్యాయి. తాజాగా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) రెయిన్ అలర్ట్ (Rain Red Alert) జారీ చేసింది. రాయ్‌గఢ్, రత్నగిరి, సతారా, కొల్హాపూర్, పూణె సహా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. ఇక ముంబై నగరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఐఎండీ హెచ్చరికలతో ముంబై (Mumbai) పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు కొనసాగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. అవసరమైతేనే బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు, సిబ్బంది సూచనలను పాటిస్తూ జాగ్రత్తగా, సురక్షితంగా ఉండాలని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితిలో 100, 112, 103 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఆదివారం నగరంలో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకుపోయాయి. అనేక చోట్ల చెట్లు కూలిపోయాయి. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు.
Also Read..
Rahul Gandhi | ఓటరు జాబితా సవరణ ఓట్ల చోరీకి నూతన ఆయుధం: రాహుల్‌గాంధీ
Naveen Patnaik | ఆస్పత్రిలో చేరిన ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్.. వైద్యులు ఏమన్నారంటే..?
Army Jawan | ఆర్మీ జవాన్‌ను పోల్‌కు కట్టేసి కర్రలతో దాడిచేసిన టోల్ సిబ్బంది.. వీడియో