IndiGo | ఇండిగో సంక్షోభం (IndiGo crisis)పై కేంద్ర పౌర విమానయాన మంత్రి (Aviation minister) రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) స్పందించారు. ఇండిగో అంతర్గత సమస్యలతోనే ఈ సంక్షోభం తలెత్తినట్లు చెప్పారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో ఎంపీ ప్రమోద్ తివారీ లేవనెత్తిన ప్రశ్నకు రామ్మోహన్ నాయుడు సమాధానమిచ్చారు.
Speaking in Rajya Sabha on the IndiGo crisis, Union Civil Aviation Minister Ram Mohan Naidu Kinjarapu says, ” IndiGo crisis happened due to problems in its crew rostering and internal planning system…” pic.twitter.com/j7UJ5f40HB
— ANI (@ANI) December 8, 2025
‘ఇండిగో సంక్షోభాన్ని తేలిగ్గా తీసుకోవడం లేదు. దీనిపై ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాం. పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకున్నాం. సమస్య పరిష్కారానికి వెంటనే అప్రమత్తం చేశాం. ఇండిగో సంక్షోభానికి దాని సిబ్బంది రోస్టరింగ్, అంతర్గత ప్రణాళిక వ్యవస్థలోని సమస్యలే కారణం. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నియమాలతో ఎలాంటి సమస్యలూ లేవు. అందరితో చర్చించాకే ఎఫ్డీటీఎల్ నిబంధనలను రూపొందించాం. నెల వరకూ సజావుగానే విమాన సర్వీసులు నడిచాయి. డిసెంబర్ 1న జరిగిన సమావేశంలోనూ ఇండిగో ఎలాంటి సమస్యనూ లేవనెత్తలేదు. డిసెంబర్ 3 నుంచే సమస్య మొదలైంది. ఇండిగో విమానాల రద్దు, ఆలస్యం కారణంగా లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రయాణికులకు కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని అన్నారు.
Speaking in Rajya Sabha on the IndiGo crisis, Union Civil Aviation Minister Ram Mohan Naidu Kinjarapu says, ”
For all passengers who have faced difficulties due to delays and cancellations, strict Civil Aviation Requirements (CARs) are in place. Airline operators have to follow… pic.twitter.com/NLvUCykFku— ANI (@ANI) December 8, 2025
అదేవిధంగా ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో టికెట్ ధరలు పెంచకుండా పరిమితి విధించినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. టికెట్ ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అయితే, ఇండిగో సంక్షోభంపై రామ్మోహన్ నాయుడు చెప్పిన సమాధానంపై విపక్ష ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ గందరగోళం కారణంగా సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.
Also Read..
Supreme Court | ఇండిగో సంక్షోభంపై అత్యవసర విచారణకు సుప్రీం నిరాకరణ
IndiGo | సంక్షోభం వేళ భారీగా పతనమైన ఇండిగో షేర్లు
IndiGo | ఏడో రోజూ ఇండిగో సంక్షోభం.. నేడు వందలాది విమానాలు రద్దు