న్యూఢిల్లీ : ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన వేళ జెరూసలేం నుంచి ఒక కొత్త భౌగోళిక రాజకీయ కూటమిపై ప్రకటన వచ్చింది. పశ్చిమాసియాలో ‘రాడికల్ గొడ్డలి’ని ఎదుర్కోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు షడ్భుజ కూటమిని ప్రతిపాదించారు. ఇందులో ఇజ్రాయెల్, గ్రీస్, సైప్రస్లతో పాటు భారత దేశాన్ని ప్రధాన భాగస్వామిగా పేర్కొన్నారు.
ఈ కూటమిలో అరబ్, ఆఫ్రికన్, ఆసియా దేశాలు కూడా భాగస్వాములుగా ఉంటాయని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఒక పక్క ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండగా, మరో పక్క నాటో తరహాలో కూటమి ఏర్పాటుకు తుర్కియే ఉత్సాహం చూపిస్తున్న వేళ ఈ కూటమిపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.