ఉరేసుకుని భర్త.. విషం తాగి.. నిజామాబాద్‌లో దంపతుల ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. ఇంటి కొనుగోలు కోసం చేసిన అప్పులు తీర్చలేక మానసిక ఒత్తిడికి గురైన దంపతులు బలవన్మరణానికి పాల్పడింది.
ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. ఇంటి కొనుగోలు కోసం చేసిన అప్పులు తీర్చలేక మానసిక ఒత్తిడికి గురైన దంపతులు బలవన్మరణానికి పాల్పడింది. భర్త బెడ్రూంలో ఉరివేసుకోగా.. భార్య మరో గదిలో విషం తాగింది.
వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా మొండోరా మండలం నాగంపేటకు చెందిన శేషాల నరేశ్ (35)కు నిజామాబాద్ జిల్లా కోటగల్లికి చెందిన మేఘన (30)తో 2014లో వివాహమైంది. వీరికి అయాన్ష్ (9), మిథున్ (7) ఇద్దరు కుమారులు ఉన్నారు. తండ్రి మరణించడంతో నరేశ్‌కు విద్యుత్ శాఖలో ఐదేళ్ల కిందట అటెండర్ ఉద్యోగం వచ్చింది. ఆరు నెలల కిందట జూనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందాడు. ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ ఈఆర్వో కార్యాలయంలో పనిచేస్తూ వినాయక్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు.
నరేశ్ గతేడాది సుమారు రూ.90లక్షల అప్పు చేసి, సొంతిల్లు కొనుగోలు చేశాడు. ఆ ఇంటిపై బ్యాంక్ లోన్ తీసుకుని.. బయట తీసుకున్న అప్పులు చెల్లించాలని అనుకున్నాడు. కానీ బ్యాంకులో లోన్ దొరకలేదు. బయట బాకీల నుంచి ఒత్తిళ్లు పెరిగిపోయాయి. దీంతో కొద్దిరోజుల కింద ఇల్లు అమ్మి, వచ్చిన డబ్బులతో కొంతమేర బాకీలు తీర్చాడు. అయినప్పటికీ పెద్ద మొత్తంలో అప్పు అలాగే ఉండటంతో నరేశ్ మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో అతనికి కుటుంబసభ్యులు చికిత్స కూడా చేయిస్తున్నారు. ఇదిలా ఉంటే మంగళవారం ఉదయం పిల్లలు పాఠశాలకు వెళ్లిన అనంతరం నరేశ్, మేఘన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. నరేశ్ బెడ్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా.. భార్య మేఘన మరో గదిలో విషయం తాగి బలవన్మరణానికి పాల్పడింది.
అంతకుముందు ఉదయం 10.30 గంటల సమయంలో మేఘన తల్లి లావణ్య ఫోన్ చేయగా.. కుమార్తె సరిగ్గా మాట్లాడలేదు. పిల్లల గురించి అడిగితే వేరే ఇంటికి పంపించానని చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన తల్లి గంటన్న తర్వాత భర్త, బంధువులతో కలిసి కుమార్తె ఇంటికి వెళ్లింది.అక్కడ గది తలుపులు ఎంత కొట్టినా తలుపు తీయలేదు. కిటికీలో నుంచి లోపలికి వెళ్లి చూడగా నరేశ్, మేఘన అపస్మారక స్థితిలో కనిపించారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లుగా నిర్ధారించారు.
కాగా, అప్పులు, అనారోగ్యమే తన ఆత్మహత్యకు కారణమని నరేశ్ కుటుంబసభ్యులకు ఓ లేఖ రాశాడు. తమ మీద కోపాన్ని పిల్లలపై చూపొద్దని, వారిని జాగ్రత్తగా చూసుకోవాలని కోరాడు. వారు బాగా చదువుకుని ఉన్నత స్థాయిలో స్థిరపడాలని ఆకాంక్షించాడు. భర్త ఆత్మహత్య చేసుకోకముందే.. మేఘన ఆ లేఖ చూసి ఉంటుందని.. మనస్తాపంతో ముందుగానే తానే విషం తాగి ఉండొచ్చని బంధువులు భావిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Train Trailer | మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు విజయ్ సేతుపతి.. ఆకట్టుకుంటున్న ‘ట్రైన్’ ట్రైలర్!
Diksha Divas | ముఖ్రా (కె) గ్రామంలో ఒకరోజు ముందే దీక్షా దివస్.. కేసీఆర్ చిత్రపటానికి పూలు, పాలతో అభిషేకం.. Video
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

