Avalanche | జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్ (Gulmarg)ను భారీ హిమపాతం (అవలాంచ్, మంచు ఉప్పెన) ముంచెత్తింది. ఒక్కసారిగా మంచు ముంచెత్తడంతో పర్యాటకులు భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనలో విదేశీ పర్యాటకులు ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు గల్లంతయ్యారు. సుమారు ఐదుగురిని భద్రతా సిబ్బంది సురక్షితంగా రక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారికోసం గాలింపు చేపడుతున్నారు.
🚨🚀India ,avalanche hits Gulmarg. Emergency rescue services pressed in.
#Kashmir #Gulmarg #avalancheinGulmarg #Avalanche pic.twitter.com/cHO9VeW5yY
— EUROPE CENTRAL (@europecentrral) February 22, 2024
కశ్మీర్ ప్రాంతంలో అవలాంచ్ (Avalanche)లు ఏర్పడటం సర్వసాధరణమే. అక్కడ రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. అలాంటి సమయంలోనే అక్కడక్కడా అవలాంచ్లు ఏర్పడతాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో బుధవారం కూడా ప్రముఖ హిల్స్టేషన్ సోన్మార్గ్లో అవలాంచ్ ఏర్పడింది. ఈ మంచు మొత్తం సింధ్ నది (Sindh river)పై పడటంతో నదీ ప్రవాహం ఎక్కడికక్కడ నిలిపోయింది. ఆ నీరంతా రోడ్డుపైకి ప్రవహించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు యంత్రాల సాయంతో నదిపై పడిన మంచును కొన్ని గంటలపాటు శ్రమించి తొలగించారు.
Also Read..
Ship rams bridge | నదిపై నిర్మించిన వంతెనను ఢీ కొట్టిన భారీ నౌక.. ఇద్దరు మృతి
Trisha Krishnan | అన్నాడీఎంకే మాజీ నేత ఏవీ రాజుకు లీగల్ నోటీసులు పంపిన త్రిష