Trisha Krishnan | అన్నాడీఎంకే మాజీ నేత ఏవీ రాజుకు లీగల్ నోటీసులు పంపిన త్రిష
Trisha Krishnan | తనను కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసినందకు గానూ అన్నాడీఎంకే మాజీ నేత (ex AIADMK leader) ఏవీ రాజు (AV Raju)పై ప్రముఖ నటి త్రిష కృష్ణన్ (Trisha Krishnan) పరువు నష్టం కేసు (defamation case) పెట్టింది. తన లాయర్ ద్వారా ఏవీ రాజుకు లీగల్ నోటీసులు పంపింది.
Trisha Krishnan | తనను కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసినందకు గానూ అన్నాడీఎంకే మాజీ నేత (ex AIADMK leader) ఏవీ రాజు (AV Raju)పై ప్రముఖ నటి త్రిష కృష్ణన్ (Trisha Krishnan) చర్యలు తీసుకుంది. ఈ మేరకు పరువు నష్టం కేసు (defamation case) పెట్టింది. తన లాయర్ ద్వారా ఏవీ రాజుకు లీగల్ నోటీసులు పంపింది. ఈ విషయాన్ని త్రిష గురువారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు లీగల్ నోటీసుల ఫొటోలను కూడా నెటిజన్లతో పంచుకుంది.
ఇంతకీ ఏం జరిగిందంటే..
కాగా, అన్నాడీఎంకే తమిళనాడు ఏఐఏడీఎంకే నేత ఏవీ రాజుకీ, అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే జీ వెంకటాచలానికి మధ్య వివాదం కొనసాగుతున్నది. ఈ క్రమంలో ఏవీ రాజు.. వెంకటాచలాన్ని ఉద్దేశించి విమర్శలు చేస్తూ మధ్యలో హీరోయిన్ త్రిష కృష్ణన్ పేరును ప్రస్తావించాడు. అంతటితో ఆగకుండా ఆమె వ్యక్తిగత జీవితంపై సంచలన కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైర్ అయ్యింది. దీనిపై త్రిష సైతం మండిపడింది. ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఏ స్థాయికైనా దిగజారగల ఇలాంటి నీచమైన మనుషులను మళ్లీ మళ్లీ చూడడం మరింత ఘోరంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. తన ఓపిక నశించిందని.. ఇక అలాంటి వ్యక్తులను క్షమించననని.. వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఎవరు మాట్లాడినా లీగల్ డిపార్ట్మెంట్ నుంచే సమాధానం వస్తందంటూ హెచ్చరించింది. ఏవీ రాజు వ్యాఖ్యలపై పలువురు సినీ తారలు కూడా మండిపడ్డారు.
త్రిషకు క్షమాపణలు
దీంతో ఏవీ రాజు.. త్రిషకు క్షమాపణలు కూడా చెప్పారు. తన ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. నటిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం తన ఉద్దేశం కాదన్నారు. అలాగే, దర్శకుడు చరణ్, నటుడు కరుణాదాస్తో పలువురికి క్షమాపణలు చెబుతున్నానని.. ఎవరి మనోభావాలు దెబ్బతిన్నట్లయితే క్షమించాలని కోరారు.
ఇక త్రిష సినిమాల విషయానికి వస్తే చివరిసారిగా ‘లియో’ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఐదు సినిమాల్లో నటిస్తున్నది. విదా ముయార్చి చిత్రంలో అజిత్‌తో జతకట్టబోతున్నది. మోహన్‌లాల్ లీడ్‌లో తెరకెక్కనున్న రామ్, ఐడెంటిటీ, థగ్ లైఫ్ చిత్రాలతో పాటు మెగాస్టార్ హీరోగా తెరక్కెతున్న విశ్వంభర చిత్రంలోనూ కనిపించబోతున్నది. దాదాపు 18 సంవత్సరాల తర్వాత చిరుతో జంటగా నటిస్తున్నది.
— Trish (@trishtrashers) February 22, 2024
Also Read..
PM Modi | రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. అన్నదాతల ఆందోళనల వేళ ప్రధాని మోదీ ట్వీట్
Sachin Tendulkar | గుల్మార్గ్లో సచిన్ గల్లీ క్రికెట్.. వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

