Sachin Tendulkar | మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ప్రస్తుతం కశ్మీర్ (Kashmir)లో పర్యటిస్తున్నారు. తన కుటుంబంతో కలిసి తొలిసారి ఆయన కశ్మీర్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఈ పర్యటనలో సచిన్ తన బ్యాట్‌కు పనిచెప్పారు. గుల్మార్గ్ (Gulmarg)లో గల్లీ క్రికెట్ (gully cricket) ఆడారు. అక్కడి రోడ్డుపై స్థానికులతో కలిసి ఎంతో ఉత్సాహంగా బ్యాటింగ్ చేస్తూ సందడి చేశారు (Plays Cricket With Locals). ఇందుకు సంబంధించిన వీడియోని సచిన్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో నెటిజన్లు, క్రికెట్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.
Cricket & Kashmir: A MATCH in HEAVEN! pic.twitter.com/rAG9z5tkJV
— Sachin Tendulkar (@sachin_rt) February 22, 2024
ఈ పర్యటనలో సచిన్ పలు ప్రాంతాలను కూడా సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి క్రికెట్ బ్యాట్ల తయారీ కేంద్రాన్ని బుధవారం సచిన్ విజిట్ చేశారు. కశ్మీర్లో మాత్రమే లభించే విల్లో చెట్టు టేకుతో తయారు చేసిన బ్యాట్లను ఆయన పరిశీలించారు. బ్యాట్ నాణ్యత, ఇతర అంశాలపై బ్యాట్ తయారీ కేంద్రం వారితో చర్చించారు. తన తొలి బ్యాట్ కశ్మీర్ విల్లోతో చేసిందేనని ఈ సందర్భంగా సచిన్ గుర్తు చేసుకున్నారు. తన సోదరి ఆ బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చిందని చెప్పుకొచ్చారు.
The first bat given to me was by my sister and it was a Kashmir willow bat. Ab main yahan hoon to Kashmir willow ko to milna banta hai! 🏏
P.S: An interesting fact; some of my favourite bats had only about 5-6 grains. How many grains do your bats have? pic.twitter.com/SMI7bFevCW
— Sachin Tendulkar (@sachin_rt) February 21, 2024
అదేవిధంగా సచిన్.. జమ్మూ కాశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లోని నియంత్రణ రేఖపై చివరి పాయింట్ అయిన అమన్ సేతు వంతెనను కూడా సందర్శించారు. గంట పాటు అక్కడే ఉన్నారు. అమన్ సేతు సమీపంలోని కమాన్ పోస్ట్ వద్ద సైనికులతో కాసేపు ముచ్చటించారు. ఇక దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్ పర్యాటక కేంద్రాన్ని కూడా ఆయన సందర్శించారు.
Also Read..
PM Modi | రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. అన్నదాతల ఆందోళనల వేళ ప్రధాని మోదీ ట్వీట్
Arvind Kejriwal | కేజ్రీవాల్‌కు ఏడోసారి ఈడీ సమన్లు
Massive Landslide | జమ్మూ కశ్మీర్లో విరిగిపడ్డ కొండచరియలు.. హైవేపై నిలిచిపోయిన వందలాది వాహనాలు