Arvind Kejriwal | కేజ్రీవాల్‌కు ఏడోసారి ఈడీ సమన్లు
Arvind Kejriwal | మద్యం కుంభకోణం కేసు (Delhi liquor policy case)లో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు.
Arvind Kejriwal | మద్యం కుంభకోణం కేసు (Delhi liquor policy case)లో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు. ఈ కేసులో ఈడీ నుంచి కేజ్రీవాల్‌కు సమన్లు జారీకావటం ఇది ఏడోసారి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు ఇప్పటికే ఆరు సార్లు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. దీంతో తాజాగా మరోసారి ఈడీ సమన్లు పంపింది. ఫిబ్రవరి 26వ తేదీన ఏజెన్సీ కార్యాలయంలో విచారణకు ప్రత్యక్షంగా హాజరుకావాలని సమన్లలో ఈడీ పేర్కొంది.
గతంలో నవంబర్ 2న, డిసెంబర్ 21న, ఆ తర్వాత జనవరి 3న కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జనవరి 13వ తేదీన కూడా నాలుగోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది. కానీ, నాలుగు సార్లూ ఈడీ నోటీసుల్ని కేజ్రీవాల్ పట్టించుకోలేదు. దీంతో జనవరి 31, ఫిబ్రవరి 14వ తేదీన కూడా ఈడీ నోటీసులు పంపింది. అయితే అప్పుడు కూడా ఆయన విచారణకు హాజరుకాలేదు. పైగా ఈడీ నోటీసులు అక్రమమంటూ కొట్టిపారేశారు. తనను అరెస్ట్ చేసే కుట్రలో భాగంగానే నోటీసులు పంపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏడోసారి ఈడీ సమన్లు పంపింది. తాజా నోటీసులపై సీఎం ఇంకా స్పందించలేదు. అయితే, ఈసారైనా విచారణకు వెళ్తారో లేదో చూడాలి.
Also Read..
Massive Landslide | జమ్మూ కశ్మీర్లో విరిగిపడ్డ కొండచరియలు.. హైవేపై నిలిచిపోయిన వందలాది వాహనాలు
farmers protest | రైతులు కీలక నిర్ణయం.. ఢిల్లీ చలో మార్చ్ రెండు రోజులు వాయిదా
Hyderabad | హైదరాబాద్ రోడ్లపై దూసుకుపోతున్న లగ్జరీ కార్లు..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

