Atishi | ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి (Delhi Chief Minister)గా అతిశీ (Atishi) బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం ఢిల్లీ సచివాలంలో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా గతంలో సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ కూర్చున్న కుర్చీలో కాకుండా.. వేరే కుర్చీలో కూర్చుని బాధత్యలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆప్ నేతలు పాల్గొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అతిశీ 5 నెలలు మాత్రమే ఢిల్లీ సీఎంగా ఉండనున్నారు.
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిశీ శనివారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. రాజ్ నివాస్‌లో జరిగిన కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆమెతోపాటు ఆప్ నేతలు గోపాల్‌రాయ్, కైలాశ్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్, ముఖేష్, అహ్లావత్ క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అతిశీ ఢిల్లీకి ఎనిమిదో ముఖ్యమంత్రి కాగా, అత్యంత పిన్న వయస్కురాలైన సీఎంగా ఆమె రికార్డులకెక్కారు. అలాగే, ఢిల్లీ పీఠాన్ని అధిష్టించిన మూడో మహిళగానూ మరో ఘనత సాధించారు.
#WATCH | Delhi’s new CM Atishi takes charge as the Chief Minister. pic.twitter.com/ZBH8tfLmGe
— ANI (@ANI) September 23, 2024
Also Read..
Mahesh Babu | సీఎం సహాయ నిధికి రూ.50 లక్షలు అందజేసిన మహేశ్ బాబు
Snake | రన్నింగ్ ట్రైన్లో పాము ప్రత్యక్షం.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు.. వైరల్ వీడియో