Delhi | దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో అత్యంత శీతల పరిస్థితులు నెలకొన్నాయి (coldest morning). ఈ శీతాకాల సీజన్ మొత్తంలో శుక్రవారం ఢిల్లీలో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. చలికి తోడు రాజధాని నగరంపై దట్టమైన పొగ కమ్మేసింది (Dense Fog). శుక్రవారం ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 3.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది.
#WATCH | Delhi: Drone visuals of the dense fog in the National Capital as the coldwave continues and the temperature dips further.
(Visuals from Moti Bagh shot at 7.30 am) pic.twitter.com/dTN1ztOAef
— ANI (@ANI) January 12, 2024
ఇక దట్టమైన పొగ మంచు కారణంగా రోడ్డు, రైలు, విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పొగమంచు కారణంగా విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది. కొన్ని ఏరియాల్లో దృశ్యమానత జీరోకు పడిపోయింది (zero visibility). దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక పొగమంచు కారణంగా ఢిల్లీకి రాకపోకలు సాగించే సుమారు 23 రైళ్లు గంట నుంచి ఆరుగంటలు ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
23 trains to Delhi from various parts of the country are running late due to dense fog conditions as on 12th January. pic.twitter.com/gfu6HK6r22
— ANI (@ANI) January 12, 2024
ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచు ఏర్పడింది. దీంతో అక్కడ విజిబిలిటీ దాదాపు జీరోకు పడిపోయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పలు విమానాలు కొంత ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులకు ఢిల్లీ విమానాశ్రయం అధికారులు అడ్వైజరీ జారీ చేశారు. విమాన సమాచారం కోసం సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాల్సిందిగా సూచించారు.
#WATCH | Cold wave conditions continue in Delhi, thick layer of fog engulfs national capital
(Visuals from Geeta Colony Road and Vikas Marg, shot at 6:40 am) pic.twitter.com/VgCcz2boco
— ANI (@ANI) January 12, 2024
#WATCH | Delhi: Dense fog engulfs the city as the coldwave continues and the temperature dips further.
(Visuals from Sarojini Nagar shot at 7.45 am) pic.twitter.com/8n1SZK8jJx
— ANI (@ANI) January 12, 2024
#WATCH | Delhi: Coldwave and dense fog engulfs the National Capital
(Visuals from Shanti Path shot at 7 am) pic.twitter.com/MQXzVOOBDT
— ANI (@ANI) January 12, 2024
Also Read..
Akshay Kumar | ముంబై మెట్రోలో ప్రయాణించిన అక్షయ్ కుమార్.. వీడియో
Earthquake | అఫ్గానిస్థాన్‌లో భూకంపం.. 24 గంటల్లో రెండోసారి
Houthi Rebels | హౌతీ రెబల్స్‌పై అమెరికా, యూకే ప్రతీకార దాడులు..