Akshay Kumar | ముంబై మెట్రోలో ప్రయాణించిన అక్షయ్ కుమార్.. వీడియో
Akshay Kumar | బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) మెట్రోలో ప్రయాణించి అభిమానులకు షాక్ ఇచ్చాడు. ప్రముఖ నిర్మాత దినేష్ విజన్‌తో కలిసి అక్షయ్.. గురువారం ముంబై మెట్రో (Mumbai Metro) రైలులో ప్రయాణించాడు.
Akshay Kumar | దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai)లో ట్రాఫిక్ (Traffic) కష్టాలను అధిగమించేందుకు సాధారణ ప్రజలే కాదు సెలబ్రిటీలు కూడా ఇప్పుడు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. త్వరగా గమ్య స్థానాలకు చేరుకునేందుకు ఎక్కువగా మెట్రో (Metro)ను అనుసరిస్తున్నారు. కొందరు బాలీవుడ్ నటులు కూడా మెట్రో ప్రయాణం చేశారు. తాజాగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) మెట్రోలో ప్రయాణించి అభిమానులకు షాక్ ఇచ్చాడు.
ప్రముఖ నిర్మాత దినేష్ విజన్‌తో కలిసి అక్షయ్.. గురువారం ముంబై మెట్రో (Mumbai Metro) రైలులో ప్రయాణించాడు. బ్లాక్ డ్రస్ ధరించి, మ్యాచింగ్ టోపీతో మెట్రోలో దర్శనమిచ్చాడు. ఎవరూ గుర్తు పట్టని విధంగా ముఖానికి వైట్ మాస్క్ పెట్టుకుని కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
#AkshayKumar travelling in a 🚇 pic.twitter.com/31Z9F9tsGN
— $@M (@SAMTHEBESTEST_) January 11, 2024
ఇక సినిమాల విషయానికి వస్తే.. అక్షయ్ కుమార్ ప్రస్తుతం టైగర్ ష్రాఫ్‌తో కలిసి ‘బడే మియా చోటే మియా’ చిత్రంలో నటిస్తున్నారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సోనాక్షి సిన్హా, మానుషి చిల్లర్ కథానాయికలు. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈద్ సందర్భంగా ఏప్రిల్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి (Rohit Shetty) దర్శకత్వంలో వస్తున్న ‘సింగం అగైన్’ చిత్రంలోనూ అక్షయ్ నటిస్తున్నారు. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే, టైగర్ ష్రాఫ్, రణ్వీర్ సింగ్, జాకీ ష్రాఫ్, అర్జున్ కపూర్, కరీనా కపూర్ వంటి భారీ తారాగణంతో రోహిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్నట్లు సమాచారం.
Also Read..
Earthquake | అఫ్గానిస్థాన్‌లో భూకంపం.. 24 గంటల్లో రెండోసారి
Houthi Rebels | హౌతీ రెబల్స్‌పై అమెరికా, యూకే ప్రతీకార దాడులు..
Jobs Scam | ఉద్యోగ నియమాక కుంభకోణం.. బెంగాల్ మంత్రి ఇంట్లో ఈడీ సోదాలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

