Shubhanshu Shukla | యాక్సియం-4 మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (International Space Station) వెళ్లిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) మరో ముగ్గురు వ్యోమగాముల (Astronauts) తిరుగు ప్రయాణం తేదీ ఖరారైన విషయం తెలిసిందే. జులై 14న వారి తిరుగు ప్రయాణం చేపడుతున్నట్లు నాసా గురువారం ప్రకటించింది. జులై 15వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయంలో (భారత కాలమానం ప్రకారం) ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ కానున్నారు.
అయితే, వ్యోమగాములు భూమికి చేరిన తర్వాత ఏడు రోజులపాటూ క్వారంటైన్‌కు (rehabilitation) తరలించనున్నట్లు ఇస్రో తాజాగా తెలిపింది. జీరో గ్రావిటీలో గడిపి వచ్చిన వ్యోమగాముల శరీరాలు భూ వాతావరణానికి అలవాటు పడేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇస్రోకు చెందిన ఫ్లైట్ సర్జన్లు వారం రోజుల పాటూ వ్యోమగాముల ఆరోగ్యం, ఫిట్నెస్ను నిరంతరం పర్యవేక్షిస్తారని వెల్లడించింది.
Also Read..
ISRO: గగన్‌యాన్‌కు చెందిన కీలక పరీక్ష విజయవంతంగా పూర్తి
IIM Calcutta | కోల్‌కతాలో మరో దారుణం.. బాయ్స్ హాస్టల్లో విద్యార్థినిపై అత్యాచారం
Ram Mohan Naidu | విమాన ప్రమాదంపై అప్పుడే ఓ నిర్ణయానికి రావొద్దు.. ప్రాథమిక నివేదికపై కేంద్ర మంత్రి