Ram Mohan Naidu | అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Air India Plane Crash)పై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదిక (preliminary probe report) విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 15 పేజీలతో ప్రాథమిక నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్‌లు సెకన్ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది. ఈ నివేదికపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి (Civil Aviation Minister) రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) స్పందించారు. అప్పుడే ఒక నిర్ణయానికి రావొద్దన్నారు. తుది నివేదిక వచ్చే వరకూ వేచి ఉండాలని సూచించారు.
‘దీనిపై అప్పుడే మనం ఎటువంటి నిర్ధరణకు రాకూడదు. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన, ప్రతిభ గల పైలట్లు, సిబ్బంది మన దగ్గర ఉన్నారు. పౌర విమానయానానికి వారు వెన్నెముక వంటివారు. ఈ రంగానికి వారే ప్రధాన వనరులు. వారి సేవలను నేను అభినందిస్తున్నాను. వారి సంక్షేమం, శ్రేయస్సు కోసం మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇలాంటి సమయంలో ఎలాంటి నిర్ధరణకు రాకుండా తుది నివేదిక కోసం వేచిచూద్దాం’ అని ఆయన అన్నారు. ‘అనేక సాంకేతిక అంశాలు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతానికి ప్రాథమిక నివేదికి మాత్రమే వచ్చింది. ఈ నివేదికపై అప్పుడే ఓ నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుంది. తుది నివేదిక కోసం వేచి ఉండాలి’ అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సూచించారు.
మరోవైపు ప్రాథమిక నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్‌లు సెకన్ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది. పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్లు మరో పైలట్‌ను ప్రశ్నించాడని, తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చాడని నివేదికలో పేర్కొంది. కాక్‌పిట్‌లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని తెలిపింది. తర్వాత పైలట్లు మేడేకాల్ ఇచ్చారని, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC) స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని వెల్లడించింది. ఈలోపే విమానం కూలిపోయిందని పేర్కొంది.
ఈ ప్రమాదం వెనుక ఎలాంటి కుట్ర కోణం లేదని తెలిపింది. పక్షి ఢీకొన్న (Bird Hit) ఆనవాళ్లు కూడా కన్పించలేదని నివేదికలో తెలిపింది. ‘విమానం ప్రయాణించిన మార్గానికి సమీపంలో పక్షులు ఎగరలేదు. పక్షి ఢీ కొన్న ఆనవాళ్లు కూడా గుర్తించలేదు. వాతావరణ సంబంధిత సమస్యలు కూడా లేవు. ఆకాశం కూడా క్లియర్‌గా ఉంది. విజిబిలిటీ బాగుంది. గాలి స్వల్పంగా వీస్తోంది’ అని తెలిపింది. అంతేకాదు, ప్రమాదం వెనుక ఎలాంటి కుట్ర కోణం లేదని తెలిపింది. విమానంపై దాడి జరిగినట్లు చెప్పేందుకు ఎలాంటి ఆధారాలూ కనిపించలేదని వివరించింది.
Also Read..
Air India Plane Crash | పక్షి ఢీ కొనలేదు.. కుట్ర కోణం లేదు.. ప్రాథమిక నివేదికలో వెల్లడి
Air India Plane Crash | బాధితులకు అండగా ఉంటాం.. ప్రాథమిక నివేదికపై బోయింగ్ స్పందన