ISRO: గగన్‌యాన్‌కు చెందిన కీలక పరీక్ష విజయవంతంగా పూర్తి
ISRO: గగన్‌యాన్‌కు చెందిన కీలక పరీక్షను ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. క్వాలిఫికేషన్ టెస్ట్ ప్రోగ్రామ్ ద్వారా సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను సమగ్రంగా పరీక్షించారు. ఇస్రో ఓ ప్రకటనలో ఈ విషయాన్ని పేర్కొన్నది.
బెంగుళూరు: గగన్‌యాన్ మిషన్‌కు చెందిన కీలక పరీక్షను ఇస్రో(ISRO) విజయవంతంగా పూర్తి చేసింది. సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను పూర్తిగా డెవలప్ చేసిన ఇస్రో.. క్వాలిఫికేషన్ టెస్ట్ ప్రోగ్రామ్ ద్వారా సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను సమగ్రంగా పరీక్షించింది. ఎస్ఎంపీఎస్కు చెందిన 350 సెకన్ల ఫుల్ డ్యూరేషన్ హాట్ టెస్ట్‌ను శుక్రవారం పూర్తి చేశారు. గగన్‌యాన్ మిషన్ ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. హాట్ టెస్ట్ సమయంలో ప్రొపల్షన్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ నార్మల్‌గా సాగిందని ఇస్రో ఇవాళ ఓ ప్రకటనలో తెలిపింది.
గగన్‌యాన్‌కు చెందిన సర్వీస్ మాడ్యూల్‌ను ప్రొపల్షన్ సిస్టమ్ ద్వారా రెగ్యులేట్ చేస్తారు. కక్ష్యలో పరిభ్రమణ దీని మీదే ఆధారపడి ఉంటుంది. ఆర్బిట్ సర్క్యలేషన్, ఆన్ ఆర్బిట్ కంట్రోల్, డీబూస్ట్ మాన్యువరింగ్ లాంటి ప్రక్రియలన్నీ సర్వీస్ మాడ్యూల్ చూసుకుంటుంది. ఆర్బిట్ సర్క్యలేషన్, డీబూస్ట్ దశల్లో లిక్విడ్ అపోజీ మోటార్ ఇంజిన్లు శక్తిని ఇస్తాయి. ఇక ఆల్టిట్యూడ్ కంట్రోల్‌ను రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్ త్రస్టర్స్ చూసుకుంటాయి. లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్.. గగన్‌యాన్ ఎస్ఎంపీఎస్ను డిజైన్ చేసి, డెవలప్ చేసినట్లు ఇస్రో చెప్పింది. తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో పరీక్షలు జరిగాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

