మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 18, 2020 , 14:46:38

పేకాట‌పై వ‌రుస క‌థ‌నాలు.. స్తంభానికి క‌ట్టేసి కొట్టిన జూద‌గాళ్లు!

పేకాట‌పై వ‌రుస క‌థ‌నాలు.. స్తంభానికి క‌ట్టేసి కొట్టిన జూద‌గాళ్లు!

గువాహ‌టి: రాష్ట్రంలో పేకాట స్థావ‌రాల‌‌పై వ‌రుస క‌థ‌నాలు రాసిన జ‌ర్న‌లిస్టుపై పేకాటరాయుళ్లు మూకుమ్మ‌డి దాడికి పాల్పడ్డారు. జ‌ర్న‌లిస్టును క‌రెంటు స్తంభానికి క‌ట్టేసి తీవ్రంగా హింసించిన ఘ‌ట‌న‌ అసోంలో గ‌త ఆదివారం జ‌రిగింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారుతున్న‌ది. రాష్ట్రంలోని కామ్‌రూప్ జిల్లాకు చెందిన మిల‌న్ మ‌హంతా ప్ర‌ముఖ అస్సామీ దిన‌ప‌త్రిక అయిన‌ ప్ర‌తీదిన్‌లో రిపోర్టర్‌గా ప‌నిచేస్తున్నారు. దిపావ‌ళికి ముందు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పేకాట‌ స్థావ‌రా‌ల‌పై వ‌రుస క‌థ‌నాలు రాశారు.

అయితే, విధుల్లో భాగంగా గ‌త ఆదివారం గువాహ‌టికి 35 కి.మీ. దూరంలో ఉన్న మీర్జా ప‌ట్ట‌ణంలో ఓ మీటింగ్‌ను క‌వ‌ర్ చేయ‌డానికి వెళ్లారు. అయితే ఓ పాన్‌షాప్ వ‌ద్ద ఉన్న మ‌హంతాను‌ ఏడుగురు దుండ‌గ‌లు అడ్డుకున్నారు. ప‌క్క‌నే ఉన్న క‌రెంట్ పోల్‌కు క‌ట్టేసి దాడికి పాల్ప‌డ్డారు. దీంతో ఆయ‌న‌కు మెడ‌, త‌ల‌, చెవుల‌పై గాయాల‌య్యాయి. ప్రస్తుతం ఆయన ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడినవారిపై ప‌లాశ్ బారి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. మిగతావాళ్ల‌ కోసం గాలిస్తున్నామ‌ని తెలిపారు.