Ashoka University Professor | అశోక విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ (Ashoka University Professor ) అలీ ఖాన్ మహ్ముదాబాద్ (Ali Khan Mahmudabad)కు స్వల్ప ఊరట లభించింది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)కు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారన్న కారణంతో అరెస్టైన ఆయనకు సుప్రీంకోర్టు (Supreme Court) తాజాగా మధ్యంతర బెయిల్ (interim bail) మంజూరు చేసింది. అయితే, ఈ కేసు దర్యాప్తును నిలిపివేయడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.
ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారన్న కారణంతో హరియాణాలోని అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ అలీఖాన్ మహ్ముదాబాద్‌ను పోలీసులు రెండు రోజుల క్రితం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజనీతి శాస్త్రం విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అయితే, అలీ ఖాన్ సామాజిక మాధ్యమాల్లో ఇచ్చిన పోస్ట్‌లో, ‘ఆపరేషన్ సిందూర్’పై కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ మీడియాకు వివరించడాన్ని మీడియా ఆర్భాటంగా వర్ణించారు. ఆయనపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
హర్యానా రాష్ట్ర మహిళా కమీషన్ కూడా ఆ ప్రొఫెసర్‌కు నోటీసులు ఇచ్చింది. రెండు రోజుల క్రితం అలీ ఖాన్‌ను పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అతను తన అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనకు ఊరట కల్పించింది.
Also Read..
Asiatic lions | భారీగా పెరిగిన ఆసియా సింహాల సంతతి.. ప్రకటించిన గుజరాత్ సీఎం
Banu Mushtaq: కన్నడ రచయిత భాను ముస్తాక్‌కు బూకర్ ప్రైజ్
Chattishgarh | ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. 20 మంది మావోయిస్టులు మృతి