Asiatic lions | గుజరాత్ (Gujarat)లో ఆసియా సింహాల (Asiatic lions) సంతతి భారీగా పెరిగింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి (Gujarat CM) భూపేంద్ర పటేల్ (Bhupendra Patel) బుధవారం ప్రకటించారు. ఈ మేరకు సింహాల జనాభాపై నిర్వహించిన 2025 గణాంకాలను విడుదల చేశారు. ఐదేళ్ల క్రితం 674గా ఉన్న సింహాల సంఖ్య ఈ ఏడాది ఇప్పటి వరకూ 891కి పెరిగినట్లు చెప్పారు.
మీడియాతో బుధవారం సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆసియా సింహాల సంఖ్య 891కి పెరిగింది అని ప్రకటించారు. జూన్ 2020లో ఆ సంఖ్య 674గా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఈ సింహాలు జీవిస్తున్నట్లు చెప్పారు. జునాగఢ్, గిర్ సోమనాథ్, భావ్‌నగర్, రాజ్‌కోట్, మోర్బి, సురేంద్రనగర్, దేవభూమి ద్వారక, జామ్‌నగర్, అమ్రేలి, పోర్ బందర్, బోటాడ్‌లో ఈ సింహాలు విస్తరించినట్లు సీఎం చెప్పారు.
మే 10- 11 తేదీల్లో సింహాల ప్రాథమిక జనాభా గణన నిర్వహించగా, తుది జనాభా గణనను మే 12-13 తేదీల్లో ప్రాంతీయ, జోనల్, సబ్-జోనల్ అధికారులు, ఎన్యూమరేటర్లు, అసిస్టెంట్ ఎన్యూమరేటర్లు, ఇన్స్పెక్టర్లు సహా 3,000 మంది స్వచ్ఛంద సేవకుల సహాయంతో నిర్వహించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అటవీ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలతో గిర్ అడవుల్లోని సింహాల సంఖ్య పెరుగుతోందని ఆయన తెలిపారు.
Also Read..
Banu Mushtaq: కన్నడ రచయిత భాను ముస్తాక్‌కు బూకర్ ప్రైజ్
Chattishgarh | ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. 20 మంది మావోయిస్టులు మృతి
Corona Virus | మహారాష్ట్రలో ఈ ఏడాది వందకుపైగా కొవిడ్ కేసులు నమోదు.. రెండు మరణాలు