Corona Virus | మహారాష్ట్రలో ఈ ఏడాది వందకుపైగా కొవిడ్ కేసులు నమోదు.. రెండు మరణాలు
Corona Virus | దక్షిణాసియాలో కొవిడ్-19 (Covid-19) మళ్లీ విజృంభిస్తోంది. భారత్‌లోనూ కరోనా వైరస్ (Corona Virus) కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
Corona Virus | దక్షిణాసియాలో కొవిడ్-19 (Covid-19) మళ్లీ విజృంభిస్తోంది. భారత్‌లోనూ కరోనా వైరస్ (Corona Virus) కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో 257 యాక్టివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అయితే, మరణాలు కూడా సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఈ ఏడాది జనవరి నుంచి మహారాష్ట్ర (Maharashtra)లో ఏకంగా వందకుపైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 6,066 స్వాబ్ టెస్ట్‌లు చేయగా 106 కేసులు పాజిటివ్‌గా తేలినట్లు చెప్పారు. అందులో కేవలం 101 మంది ముంబైకి చెందిన వారే ఉండటం గమనార్హం. మిగిలిన వారు థానే, పూణె, కొల్హాపూర్‌కు చెందిన వారుగా పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 52 పాజిటివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. వీరిలో 16 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. జనవరి నుంచి రెండు కొవిడ్ సంబంధిత మరణాలు కూడా నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంగళవారం తెలిపింది. మరణించిన వారిలో ఒకరు క్యాన్సర్ రోగి అని పేర్కొంది.
దేశంలో కొవిడ్ పరిస్థితి నియంత్రణలో ఉందని, ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు పరిస్థితిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. జలుబు, దగ్గుతో బాధపడుతున్న రోగులతోపాటు ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించిన రోగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని దవాఖానలను ఆదేశించింది.
ఆ దేశాల్లో పెరుగుదల
సింగపూర్, చైనా, థాయ్‌లాండ్‌లో కొవిడ్ పెరుగుదల తీవ్రంగా ఉంది. ఏప్రిల్ చివరి వారంలో 11వేల కేసులు సింగపూర్‌లో నమోదుకాగా, మే మొదటి వారానికి ఆ సంఖ్య 14,000 దాటింది. హాంకాంగ్‌లో మే మొదటివారంలో 1000కిపైగా కొత్త కేసులు నమోదుకాగా, 33 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలోనూ కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, ఫ్లూ లక్షణాలతో దవాఖానల్లో చేరే వారి సంఖ్య సాధారణం కంటే రెట్టింపు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఆసియా దేశాల్లో ప్రస్తుతం వైరస్ వ్యాప్తికి జేఎన్.1, దాని సబ్వేరియంట్లే కారణమని అధికారులు చెబుతున్నారు. జేఎన్.1 ఉపరకాలైన ఎల్ఎఫ్.7, ఎన్బీ.1.8 వేరియంట్ల వ్యాప్తి ఎక్కువగా ఉన్నదని సింగపూర్ తెలిపింది.
Also Read..
Dr. Jayant Narlikar | ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ నార్లికర్ ఇకలేరు
Devanand | ఐసీయూ నుంచి.. ఐఎఫ్ఎస్ అధికారిగా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

