Arvind Kejriwal | మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) జ్యుడీషియల్ కస్టడీని (Judicial Custody) కోర్టు మరోసారి పొడిగించింది. నేటితో కస్టడీ గడువు ముగియడంతో కేజ్రీని తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పెషల్ జడ్జి కావేరీ బవేజా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టు కేజ్రీ కస్టడీని సెప్టెంబర్ 25 వరకూ పొడిగించింది.
ఇక ఇదే కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌కు బెయిల్ లభించింది. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు కేజ్రీతోపాటు దుర్గేష్ పాఠక్‌కు సమన్లు పంపింది. ఈ సమన్లకు స్పందించిన ఎమ్మెల్యే ఇవాళ కోర్టు ముందు విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆయన బెయిల్ పొందారు.
మరోవైపు బెయిల్ పిటిషన్‌తో పాటు అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) ఈనెల 5న విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్ కూడిన ధర్మాసనం ఆయా పిటిషన్లపై విచారణ జరపింది. కేజ్రీ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ఇరు పక్షాల నుంచి సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసింది.
మద్యం కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో కేజ్రీని ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన తీహార్ జైల్లోనే ఉంటున్నారు. బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈడీ కేసులో బెయిల్ లభించినప్పటికీ.. ప్రస్తుతం సీబీఐ కేసులో తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
Also Read..
Sanjauli Mosque | సంజౌలి మసీదు వివాదం.. సిమ్లాలో ఉద్రిక్తత.. లాఠీచార్జ్
Earthquake | పాకిస్థాన్‌లో 5.8 తీవ్రతతో భూకంపం.. వణికిన ఉత్తర భారతం
Israel | మరోసారి ఇజ్రాయెల్‌కు మన కార్మికులు.. రూ.2లక్షల వేతనంతో 15 వేల ఉద్యోగాలకు ఆహ్వానం