Earthquake | పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan)లో భూకంపం (Earthquake) సంభవించింది. బుధవారం మధ్యాహ్నం 12:58 గంటల సమయంలో 5.8 తీవ్రతతో భూమి కంపించింది. పెషావర్, ఇస్లామాబాద్, లాహోర్‌లో కూడా ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం కేంద్రం పాకిస్థాన్‌లోని కరోర్కు నైరుతి దిశలో 25 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది.
ఈ భూకంపం ధాటికి ఉత్తర భారతదేశంలోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతం (Delhi – NCR), ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కశ్మీర్‌లోనూ భూమి కంపించినట్లు పేర్కొంది. అయితే తేలికపాటి ప్రకంపనలే కావడంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. అటు ఆఫ్ఘనిస్థాన్లోనూ భూమి కంపించినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.
An earthquake with a magnitude of 5.8 on the Richter Scale hit Pakistan at 12:58 pm (IST) today: National Center for Seismology pic.twitter.com/zhBonY3YTb
— ANI (@ANI) September 11, 2024
Also Read..
Israel | మరోసారి ఇజ్రాయెల్‌కు మన కార్మికులు.. రూ.2లక్షల వేతనంతో 15 వేల ఉద్యోగాలకు ఆహ్వానం
IIFA 2024 | హోస్ట్‌గా కాకుండా అప్పుడప్పుడు సినిమాలు తీయి.. కరణ్‌ను ఆటపట్టించిన షారుఖ్
Rajnath Singh | దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు : రాజ్‌నాథ్ సింగ్