IIFA 2024 | ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకమైనదిగా భావించే అవార్డు వేడుకలలో ఐఫా (International Indian Film Academy Awards) ఒకటి. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులు (IIFA) పేరిటా ఈ అవార్డులను ఇస్తుండగా.. 2024కు సంబంధించి వేదికను ప్రకటించారు నిర్వహాకులు. ఈసారి అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లో సెప్టెంబర్ 27 నుంచి 29 వరకు ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు ఐఫా అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా నేడు ముంబైలో IIFA 2024 పేరిటా విలేకరుల సమావేశం నిర్వహించగా.. ఈ వేడుకకు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ముఖ్య అతిథిగా వచ్చాడు. అయితే ఈ వేడుకను హోస్ట్ చేస్తున్న కరణ్ జోహర్ షారుఖ్‌ని పిలువగా.. కరణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు షారుఖ్.
షారుఖ్ మాట్లాడుతూ.. కరణ్ ఐఫా హోస్ట్‌గా చేయడానికి రిహార్సల్స్ చేయనన్నాడు. ఎందుకు అని అడుగగా.. నేను రోజు హోస్ట్ చేస్తున్నాను అంటూ సమాధానమిచ్చాడు. ఇతడు చాట్ షోలకి హోస్ట్‌గా చేస్తున్నాడు. ఫిలిం షోలకి హోస్ట్‌గా చేస్తున్నాడు. భాయ్ అప్పుడప్పుడు సినిమాలు కూడా తీయండి అంటూ షారుఖ్ వెల్లడించాడు. దీనికి కరణ్ నవ్వుతూ నేను మరిన్ని సినిమాలు చేయాలి. అది మాత్రమే చేయాలి అంటూ చెప్పుకోచ్చాడు.
షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్ మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో కుచ్ కుచ్ హోతా హై (Kuch Kuch Hota Hai), కభీ ఖుషీ కభీ ఘమ్ (Kabhi Khushi Kabhie Gham), మై నేమ్ ఈజ్ ఖాన్ (My Name is Khan), కభీ అల్విదా నా కెహనా (Kabhi Alvida Naa Kehna) సినిమాలు రాగా ఈ నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ అందుకున్నాయి. షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్లతో పాటు రానా దగ్గుబాటి, విక్కీ కౌశల్, అభిషేక్ బెనర్జీ, సిద్ధాంత్ చతుర్వేది తదితరులు ఐఫా 2024 వేడుకలను హోస్ట్ చేయనున్నారు.
SRK to Karan Johar – “Kabhi yeh show, kabhi woh show, kitna hosting karega tu mere bhai, film bhi bana le kabhi”
the meta humour 😭😭 pic.twitter.com/wl4sMb5cdL
— sohom (@AwaaraHoon) September 10, 2024
Also Read..