కోల్కతా: కోల్కతా(Kolkata Rape Case)లో ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ గురించి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. నిందితుడు సంజయ్.. దవాఖానాలో మృతదేహాలతో శృంగారం చేసినట్లు తెలుస్తోంది. ఆ శృంగారానికి చెందిన వీడియోలను అతని ఫోన్లో గుర్తించారు. దీని పట్ల పోలీసులు విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. పీజీ డాక్టర్ రేప్, హత్య వెనుక ఉన్న అన్ని కారణాలను అన్వేషిస్తూ సీబీఐ దర్యాప్తు చేపడుతున్నది. నిందితుడి ఫోన్ నుంచి వీడియోలను రికవర్ చేసినట్లు సీబీఐ అధికారులు చెప్పారు. మెడికల్ కాలేజీలో ఉన్న మార్చురీలో అతను ఆ వీడియోలను షూట్ చేసినట్లు తెలుస్తోంది. బాధితురాలి మృతదేహంతో శృంగారం చేసిన ఫోటోను గుర్తించినట్లు తెలుస్తోంది.
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సంజయ్ రాయ్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. సీబీఐ నిర్వహించిన పాలీగ్రాఫ్ పరీక్షలో.. తానేమీ తప్పు చేయలేదని అతను చెప్పాడు. కోల్కతా సెంట్రల్ జైలులో ఆగస్టు 25వ తేదీన సంజయ్కు పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించాడు. సీబీఐ అతనికి పది ప్రశ్నలు వేసింది. ముగ్గురు స్సెషలిస్టు అధికారులు ఆ దర్యాప్తులో పాల్గొన్నారు. కోల్కతా పోలీసు శాఖలో సంజయ్ రాయ్ వాలెంటీర్గా చేశాడు.