Devara Movie | ‘దేవర’ ఎంట్రీ సీన్ ఇదేనా.. కొరటాల ఏం ప్లాన్ చేస్తున్నాడు.?
Devara Movie | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూ. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'దేవర' (Devara). అప్పుడెప్పుడో అరవింద సమేత వీర రాఘవ(Aravindha Sametha Veera Raghava) తర్వాత తారక్ సోలోగా వస్తుండటం.. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కొరటాల శివ తారక్ కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో తెలుగులో పాటు పాన్ ఇండియా రేంజ్లో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
Devara Movie | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూ. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’ (Devara). అప్పుడెప్పుడో అరవింద సమేత వీర రాఘవ(Aravindha Sametha Veera Raghava) తర్వాత తారక్ సోలోగా వస్తుండటం.. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కొరటాల శివ తారక్ కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో తెలుగులో పాటు పాన్ ఇండియా రేంజ్లో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ సందర్భంగా మూవీ నుంచి మంగళవారం ట్రైలర్‌ను విడుదల చేసింది.
‘మనిషికి బతికేంత ధైర్యం చాలు.. చంపేంత ధైర్యం కాదు. కాదూ కూడదు అని మళ్లీ ఆ ధైర్యాన్ని కూడగడితే.. ఆ ధైర్యాన్ని చంపే భయాన్నవుతా..’ అంటూ తారక్ చెప్పిన డైలాగ్ ఈ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది. ముఖ్యంగా బైరా (సైఫ్ అలీఖాన్) తారక్ (దేవర) కు మధ్య వచ్చే యాక్షన్ ఘట్టాలు నందమూరి అభిమానులకు ఫుల్ మీల్స్ అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో తారక్ డ్యూయల్ రోల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఒకటి దేవర పాత్రలో నటిస్తుండగా.. రెండోది దేవర కొడుకు పాత్రలో కూడా ఎన్టీఆర్ నటిస్తున్నాడు. అయితే ట్రైలర్ చూస్తే.. దేవర ఎంట్రీ సీన్ రివీల్ చేసినట్లు తెలుస్తుంది. ఈ మూవీలో దేవర సోరచేపపై ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా దేవర సోరచేపపై సవారీ చేయడం. ఆ తర్వాత దాన్ని ఒడ్డుకు తీసుకువచ్చి పడేయడం ట్రైలర్లో కనిపిస్తుంది. దీంతో అభిమానులందరూ చిన్న దేవర ఎంట్రీ సీన్ ఇదే అని కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు దేవర పాత్రకు కూడా సాలిడ్ ఎంట్రీ సీన్ ఉండబోతున్నట్లు సమాచారం. దీనిపై క్లారిటీ రావడానికి సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Devara Movie Entry scene
Also read..
-
Donald Trump | ఇదే బెస్ట్ డిబేట్.. కమలా హారిస్‌తో చర్చపై ట్రంప్ స్పందన
-
Sharwa 37 | బర్త్ డే స్పెషల్.. శర్వానంద్ 37లో సంయుక్తా మీనన్ పాత్ర ఇదే
-
MGM Hospital | ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఘటనలో రౌడీ రాణి రాజమ్మ అరెస్ట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

