హైదరాబాద్ : వరంగల్(Warangal) ఎంజీఎం హాస్పిటల్లో(MGM Hospital) ఔట్ సోర్సింగ్ ఉద్యోగి (Outsourcing employee) సుమలతపై యూనియన్ లీడర్ రాజమ్మ (Rajamma)దాడి(Assaulted )చేసి గాయపరిచిన గాయపరిచిన సంఘటనలో రాజమ్మను మట్టెవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ మీడియాకు వివరాలను వెల్లడించారు. బిల్ల సుమలత అనే మహిళ గత 15 సంత్సరాలుగా ఎంజీఎం హాస్పిటల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నది. ఈ క్రమంలో సోమవారం విధులకు హాజరైన సుమలతను రాజమ్మ అడ్డుకుంది.
నీకు ఉద్యోగం ఇప్పించిందే నేను రెండు లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేకుంటే చంపేస్తానని బెదిరించింది. అలాగే తన వెంట తెచ్చుకున్న ఇనుప చైనుతో సుమలతపై విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. సదరు ఉద్యోగి వద్ద ఉన్న పదివేల రూపాయలు, సెల్‌ఫోన్ తీసుకొని దాడికి పాల్పడిందని సుమలత పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిరాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆలకుంట రాజమ్మను అరెస్ట్ చేసి ఆమె వద్ద ఉన్న వెయ్యి రూపాయల నగదు, దాడికి ఉపయోగించిన చైన్‌ను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించామని ఏసీపీ తెలిపారు.