AP News | కుటుంబ కలహాలతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న తల్లీ, కొడుకు, కోడలు..!
AP News | ఆంధప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దేవరాపల్లి మండలం రైవాడ గ్రామంలో తల్లి, కొడుకు, కోడలు తమ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ప్రస్తుతం ఆ ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
AP News : ఆంధప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దేవరాపల్లి మండలం రైవాడ గ్రామంలో తల్లి, కొడుకు, కోడలు తమ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ప్రస్తుతం ఆ ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. రైవాడ గ్రామానికి చెందిన చల్లా ఈశ్వరరావు, అతని భార్య నాగమణి, తల్లి వరహాలమ్మ మధ్య గత కొంతకాలంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నాగమణి గతంలో.. తన భర్త, అత్తపై చోడవరం, దేవరాపల్లి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు కూడా చేసింది. అయితే ఆదివారం రాత్రి వీరి మధ్య మరోసారి గొడవ జరిగింది. మాటామాటా పెరిగి వివాదం తీవ్రస్థాయికి చేరింది.
ఈ క్రమంలో ముగ్గురూ పిల్లలను ఇంటి నుంచి బయటకు పంపి లోపల నుంచి తలుపులు వేసుకున్నారు. ఆ తర్వాత ఇంట్లో నుంచి హాహాకారాలు వినిపించాయి. దాంతో స్థానికులు అప్రమత్తమై తలుపులు పగలగొట్టి చూశారు. అప్పటికే ముగ్గురూ మంటల్లో కాలిపోతూ కనిపించారు. వెంటనే వారిపై మంటలను ఆర్పిన స్థానికులు 108 వాహనంలో తొలుత కె కోటపాడు ఆసుపత్రికి తరలించారు. తర్వాత బాధితుల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. బాధితులు కోలుకున్న తర్వాత వారి నుంచి వాంగ్మూలం సేకరించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కుటుంబ కలహాలతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న తల్లీ, కొడుకు, కోడలు..!
Flight Services | మురసు తుపాను ప్రభావం.. విజయవాడ నుంచి 12 విమాన సర్వీసులు రద్దు
Delhi Traders: 2.5 లక్షల షాపులు మూసివేత.. 10000 కోట్ల నష్టం
Tirumala | తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 4 గంటల సమయం
AP News | మురసు ఎఫెక్ట్.. నెల్లూరు తీరం అల్లకల్లోలం.. సముద్రంలో చిక్కిన మత్స్యకారులు..!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

