Congress vs Congress | మేకెదాటు డ్యామ్ వివాదంపై.. కర్ణాటక, తమిళనాడు కాంగ్రెస్ మధ్య అంతర్గత పోరు
Congress vs Congress | కావేరీ నదిపై ప్రతిపాదిత మేకెదాటు డ్యామ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కర్ణాటక, తమిళనాడు కాంగ్రెస్ మధ్య అంతర్గత పోరును ప్రధాని పర్యటన బయటపెట్టింది.
బెంగళూరు: కావేరీ నదిపై ప్రతిపాదిత మేకెదాటు డ్యామ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కర్ణాటక, తమిళనాడు కాంగ్రెస్ మధ్య అంతర్గత పోరును ప్రధాని పర్యటన బయటపెట్టింది. (Congress vs Congress) ప్రధాని మోదీ శుక్రవారం కర్ణాటకలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మేకెదాటు ప్రాజెక్టుకు చట్టబద్ధమైన అనుమతులను వేగవంతం చేయాలని ఆ రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న సీఎం డీకే శివకుమార్ కేంద్రాన్ని కోరారు. ‘సార్, మీరు ఇప్పుడే కావేరిపై ఆనకట్టను చూశారు. కర్ణాటకలో మేకెదాటును నిర్మించాల్సిందేనని, దానిని ఎవరూ ఆపలేరని సుప్రీంకోర్టు మనందరికీ స్పష్టమైన తీర్పు ఇచ్చింది. మీరు మాకు చట్టపరంగా సహాయం చేయాలని మేం కోరుతున్నాం’ అని ప్రధాని మోదీతో ఆయన అన్నారు.
కాగా, తమిళనాడులో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఆ రాష్ట్ర కాంగ్రెస్ మేకెదాటు ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలను తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు మాణికం ఠాగూర్ శనివారం తీవ్రంగా విమర్శించారు. ‘కర్ణాటక ముఖ్యమంత్రి మొండి వైఖరిని కొనసాగిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పును, కావేరీ జల వివాదాల ట్రిబ్యునల్ ఇచ్చిన తుది తీర్పును బహిరంగంగా ఉల్లంఘిస్తున్నారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటూ, తమిళనాడు రైతుల జీవనోపాధిని దెబ్బతీసేలా ఉన్న ఈ ప్రకటన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
అలాగే దిగువ రాష్ట్రాల సమ్మతి లేకుండా, ప్రతిపాదిత ఆనకట్ట నిర్మాణానికి ఎటువంటి అనుమతులు ఇవ్వవద్దని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు మాణికం ఠాగూర్, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ‘మేకెదాటు వద్ద కర్ణాటక ఒక్క ఇటుక కూడా వేయకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే. తమిళనాడు కాంగ్రెస్ తరపున, మేం ఈ ప్రాజెక్టును ఎప్పటికీ అనుమతించబోం. మా రాష్ట్ర హక్కులను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాం, పోరాడుతాం’ అని ఆయన స్పష్టం చేశారు.
అయితే తన పార్టీ సహచరుడి అభ్యంతరాలపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ స్పందించారు. డ్యామ్ నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరని పునరుద్ఘాటించారు. మాణిక్యం ఠాగూర్‌కు పూర్తి వాస్తవాలు తెలియవని ఆయన పేర్కొన్నారు. ‘మేకెదాటు వద్ద ఆనకట్ట నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరు. తన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాణిక్యం ఠాగూర్‌కు ఉన్నది. కానీ ఆయనకు అసలు వాస్తవాలు తెలియవు. ఆయన తన ప్రతినిధి బృందంతో కర్ణాటకకు వస్తే, నేను స్వయంగా ఆనకట్ట నిర్మాణ ప్రాంతానికి తీసుకెళ్తా. వారి ప్రయోజనాలకు ఇది ఎలా ఉపయోగపడుతుందో చూపిస్తా’ అని అన్నారు.
మరోవైపు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలను తమిళనాడులోని అధికార టీవీకే ప్రభుత్వం కూడా తీవ్రంగా విమర్శించింది. ప్రతి ఎన్నికల ముందు కర్ణాటక ముఖ్యమంత్రి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని న్యాయశాఖ మంత్రి సీటీఆర్ నిర్మల్ కుమార్ ఆరోపించారు.
అలాగే తమిళనాడులో ప్రతిపక్ష డీఎంకే కూడా విజయ్ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచింది. తమిళనాడుకు జీవన్మరణ సమస్యగా మారిన కావేరీ అంశంపై, ఇకనైనా మౌనం వీడి తగిన చర్యలు తీసుకోవాలని మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా, ఈ అంశంపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress vs Congress | మేకెదాటు డ్యామ్ వివాదంపై.. కర్ణాటక, తమిళనాడు కాంగ్రెస్ మధ్య అంతర్గత పోరు
Mission Bhagiratha Pipeline | మిషన్ భగీరథ పైప్‌లైన్ నుంచి నీళ్లు ఎలా పోతున్నాయో చూడండి.. వీడియో
పుస్తక పఠనంతో విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం : కలెక్టర్ చంద్రశేఖర్
‘పిల్లల అభిరుచులను గుర్తించి ప్రోత్సహించాలి’
Covid 19 | కరోనా కొత్త వేరియెంట్ పీజే.2.1 వేగంగా వ్యాప్తి.. ప్రమాదకరమైనదా..?
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

