పుస్తక పఠనంతో విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం : కలెక్టర్ చంద్రశేఖర్
పుస్తక పఠనంతోనే విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శనివారం 59వ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని...
– గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు
– నల్లగొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా 59వ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం
రామగిరి, నవంబర్ 14 : పుస్తక పఠనంతోనే విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శనివారం 59వ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. గ్రంథాలయ పితామహుడు డాక్టర్ ఎస్.ఆర్.రంగనాథన్, బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పండిట్ జవహర్లాల్ నెహ్రూ, చదువుల తల్లి సరస్వతి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పుస్తకం మనిషికి నిత్య సహచరమని, ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కొంత సమయాన్ని పుస్తక పఠనానికి కేటాయించాలని సూచించారు. విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు గ్రంథాలయాలను వినియోగించుకుని తమ లక్ష్యాలను సాధించాలని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రంథాలయాలను డిజిటల్ గ్రంథాలయాలుగా అభివృద్ధి చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రంథాలయాలు అందిస్తున్న సేవలను పాఠకులు, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

పుస్తక పఠనంతో విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం : కలెక్టర్ చంద్రశేఖర్
రూ.10 కోట్లతో నూతన గ్రంథాలయ భవనం
నల్లగొండ జిల్లా కేంద్ర గ్రంథాలయానికి నూతన భవనం నిర్మించేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేయడం హర్షణీయమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.ఎ. హఫీజ్ ఖాన్ అన్నారు. టౌన్‌హాల్ ప్రాంగణంలో నూతన భవనం నిర్మాణానికి నిధులు కేటాయించినట్లు తెలిపారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మహమ్మద్ అబ్దుల్ అలీ అమీర్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గాదె వినోద్ రెడ్డి, ప్రముఖ విద్యావేత్త గోనె రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, 12వ వార్డు కార్పొరేటర్ మామిడి కార్తీక్, జిల్లా గ్రంథాలయ సంస్థ ప్రతినిధులు, ఉద్యోగుల సంఘం నాయకులు, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పుస్తక పఠనంతో విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం : కలెక్టర్ చంద్రశేఖర్
‘పిల్లల అభిరుచులను గుర్తించి ప్రోత్సహించాలి’
Covid 19 | కరోనా కొత్త వేరియెంట్ పీజే.2.1 వేగంగా వ్యాప్తి.. ప్రమాదకరమైనదా..?
Cruise Ship: స్టీరింగ్ కంట్రోల్ తప్పి క్రూయిజ్‌ను ఢీకొన్న ట్యాంకర్.. లగ్జరీ నౌక నుంచి దూకిన ప్రయాణికులు.. వీడియో
Sabitha Indra Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూలాన్ని మరిచిపోయారు.. మూసీ సుందరీకరణపై సబితాఇంద్రారెడ్డి ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

