Mission Bhagiratha Pipeline | మిషన్ భగీరథ పైప్‌లైన్ నుంచి నీళ్లు ఎలా పోతున్నాయో చూడండి.. వీడియో
Mission Bhagiratha Pipeline | ఓ వైపు తాగునీటితో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మరోవైపు మిషన్ భగీరథ అధికారులు మాత్రం మిషన్ భగీరథ నీళ్లు వృథాగా పోతున్నా ఇవేవీ పట్టనట్టుగా చోద్యం చూస్తున్నారు.
Mission Bhagiratha Pipeline | కాంగ్రెస్ సర్కార్ పాలనలో తాగునీటి కష్టాలు ఎలా ఉన్నాయో తెలిపే దృశ్యాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ రోజూ ఎక్కడో చోట వెలుగులోకి వస్తున్నాయని తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్, కరీంనగర్, సంగారెడ్డి, నారాయణతోపాటు పలు జిల్లాల్లో తాగునీటి కోసం ప్రజలు రోడ్డెక్కిన ఘటనలు కనిపిస్తూనే ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఇప్పటికే సంగారెడ్డి పట్టణంలో పలు కాలనీల వాసులు తాగునీటి డ్రమ్ములు, ఖాళీ బిందెలతో వాటర్ ట్యాంకర్ల దగ్గర క్యూలైన్లు కట్టిన ఫొటోలు నెట్టింట రౌండప్ చేస్తున్నాయి. అయితే తాగునీటితో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మరోవైపు మిషన్ భగీరథ అధికారులు మాత్రం మిషన్ భగీరథ నీళ్లు వృథాగా పోతున్నా ఇవేవీ పట్టనట్టుగా చోద్యం చూస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట నుంచి రాయపాడు మార్గంలో రోడ్డు పక్కనే ఉన్న మిషన్ భగీరథ పైప్‌లైన్ గేట్వాల్ నుంచి నీళ్లు లీకై భారీ ఎత్తున పైకి చిమ్ముతున్నాయి. మెయిన్ రోడ్డు వెంబడి నీటి సరఫరా పైప్ లైన్ నుంచి విచ్చలవిడిగా నీళ్లు వృథాగా పోతున్నా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంపై నెటిజన్లు, ప్రజలు మండిపడుతున్నారు. నీళ్లు వృథా చేస్తే సామాన్య ప్రజలకు జరిమానా విధిస్తారు కానీ ప్రభుత్వానికి ఎలాంటి రూల్స్ ఉండవా అంటూ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగంపై ఫైర్ అవుతున్నారు.
విచ్చలవిడిగా నీళ్లు వృథా
చోద్యం చూస్తున్న మిషన్ భగీరథ అధికారులు
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట నుంచి రాయపాడు మధ్యలో వృథాగా పోతున్న మిషన్ భగీరథ నీళ్లు
నీళ్లు వృథా చేస్తే సామాన్య ప్రజలకు జరిమానా విధిస్తారు కానీ ప్రభుత్వానికి ఎలాంటి రూల్స్ ఉండవా అంటూ విమర్శలు https://t.co/1thsZX66P2
— Telugu Scribe (@TeluguScribe) November 14, 2026
Read Also :
Vaibhav Sooryavanshi: మెన్స్ టీ20 క్రికెట్లో యంగెస్ట్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ రికార్డు
Ashok Galla | న్యూ ఇయర్ కానుకగా అశోక్ గల్లా ‘VISA – వింటారా సరదాగా’!
SpaceX: అతిపెద్ద రాకెట్‌ను ప్రయోగించిన స్పేస్ఎక్స్.. పేలిన ఫస్ట్ స్టేజ్ బూస్టర్
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mission Bhagiratha Pipeline | మిషన్ భగీరథ పైప్‌లైన్ నుంచి నీళ్లు ఎలా పోతున్నాయో చూడండి.. వీడియో
పుస్తక పఠనంతో విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం : కలెక్టర్ చంద్రశేఖర్
‘పిల్లల అభిరుచులను గుర్తించి ప్రోత్సహించాలి’
Covid 19 | కరోనా కొత్త వేరియెంట్ పీజే.2.1 వేగంగా వ్యాప్తి.. ప్రమాదకరమైనదా..?
Cruise Ship: స్టీరింగ్ కంట్రోల్ తప్పి క్రూయిజ్‌ను ఢీకొన్న ట్యాంకర్.. లగ్జరీ నౌక నుంచి దూకిన ప్రయాణికులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

