‘పిల్లల అభిరుచులను గుర్తించి ప్రోత్సహించాలి’
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని కామేపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శనివారం కారేపల్లిలో గల అంగన్వాడీ కేంద్రంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఫ్యాన్సీ డ్రెస్ పోటీలను ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో...
– ఖమ్మం జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల
– కామేపల్లి ఐసిడిఎస్ ఆధ్వర్యంలో చిన్నారులకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు
– వివిధ వేషధారణల్లో ఆకట్టుకున్న చిన్నారులు
కారేపల్లి, నవంబర్ 14 : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని కామేపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శనివారం కారేపల్లిలో గల అంగన్వాడీ కేంద్రంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఫ్యాన్సీ డ్రెస్ పోటీలను ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో అంగన్వాడీ చిన్నారులు వివిధ రకాల ఆకర్షణీయమైన వేషధారణలతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. దేశ నాయకులు, వివిధ పాత్రలు, సంప్రదాయ వేషధారణలతో చిన్నారులు చేసిన సందడి అందరినీ ఆకట్టుకుంది. చిన్నారుల ఆటపాటలు, నవ్వులు, కేరింతలతో కార్యక్రమ ప్రాంగణం సందడిగా మారింది. జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. బాలల దినోత్సవం పిల్లల హక్కులు, వారి అభివృద్ధి, విద్య, ఆరోగ్యం పట్ల సమాజానికి అవగాహన కల్పించే ముఖ్యమైన రోజు అని తెలిపారు.

‘పిల్లల అభిరుచులను గుర్తించి ప్రోత్సహించాలి’
చిన్నారులే దేశ భవిష్యత్ అని, వారి ఎదుగుదలకు తగిన ప్రోత్సాహం, పోషకాహారం, నాణ్యమైన విద్య, మంచి వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు ప్రాథమిక విద్య, ఆరోగ్య పరిరక్షణ,మానసిక వికాసానికి అవసరమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల అభిరుచులను గుర్తించి వారిని ప్రోత్సహించాలని సూచించారు. చిన్నారుల ప్రతిభను గుర్తించి అభినందించడం ద్వారా వారిలో మరింత ఉత్సాహం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కామేపల్లి ఐసీడిఎస్ ప్రాజెక్ట్ సీడీపీవో క్రిష్టిపాటి ఉమా, సూపర్వైజర్ కృష్ణకుమారి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, తల్లిదండ్రులు, చిన్నారులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
- Tags
- ICDS
- karepally
- khammam news
- Pramila
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పిల్లల అభిరుచులను గుర్తించి ప్రోత్సహించాలి’
Congress vs Congress | మేకెదాటు డ్యామ్ వివాదంపై.. కర్ణాటక, తమిళనాడు కాంగ్రెస్ మధ్య అంతర్గత పోరు
Mission Bhagiratha Pipeline | మిషన్ భగీరథ పైప్‌లైన్ నుంచి నీళ్లు ఎలా పోతున్నాయో చూడండి.. వీడియో
పుస్తక పఠనంతో విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం : కలెక్టర్ చంద్రశేఖర్
Covid 19 | కరోనా కొత్త వేరియెంట్ పీజే.2.1 వేగంగా వ్యాప్తి.. ప్రమాదకరమైనదా..?
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

