Arvind Kejriwal | రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్‌ను హాజరుపర్చిన ఈడీ.. తీర్పుపై ఉత్కంఠ
Arvind Kejriwal | ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court)లో హాజరుపరిచారు.
Arvind Kejriwal | ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court)లో హాజరుపరిచారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీని నిన్న ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ వైద్య పరీక్షల అనంతరం ఆప్ నేతను కోర్టులో ప్రవేశ పెట్టారు.
ఈ మేరకు మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ పాత్రపై ఈడీ కోర్టుకు వివరించింది. 28 పేజీల రిమాండ్ రిపోర్ట్‌ను ఈడీ కోర్టు ముందు ఉంచింది. సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు ఈడీ తరఫున వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో కేజ్రీవాల్ కింగ్‌పిన్ (Kingpin) అని, మద్యం పాలసీ అమలులో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారని కోర్టుకు వివరించారు.
‘మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ కింగ్‌పిన్. పాలసీ అమలులో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఇందులో సౌత్ గ్రూప్‌నకు అనుకూలంగా వ్యవహరించారు. ఇది రూ.వంద కోట్ల స్కామ్ కాదు.. రూ.600 కోట్ల స్కామ్. ఇందులో కేజ్రీవాల్‌కు రూ.300 కోట్లు అందాయి. పంజాబ్, గోవా ఎన్నికల్లో ఖర్చుపెట్టింది ఈ డబ్బే. రూ.45 కోట్లు హవాలా ద్వారా గోవాకు పంపారు. ఆప్, సౌత్ గ్రూప్‌ల మధ్య విజయ్‌నాయర్ వారధిగా ఉన్నాడు. విజయ్ నాయర్ కంపెనీ నుంచి అన్ని ఆధారాలూ సేకరించాం. మా దగ్గర అన్ని ఆధారాలూ ఉన్నాయి’ అని ఈడీ వివరించింది. ఈ కేసులో విచారణ నిమిత్తం కేజ్రీవాల్‌ను పది రోజులు కస్టడీకి కోరింది. ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. న్యాయమూర్తి తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. విచారణ నేపథ్యంలో కోర్టు వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read..
Massive Traffic | ఆప్ నిరసనలతో.. ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్
Arvind Kejriwal | సుప్రీంకోర్టులో పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కేజ్రీవాల్
Arvind Kejriwal | కేజ్రీ అరెస్ట్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. పోలీసుల అదుపులో ఆప్ మంత్రులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

