అసోం.. ఇద్దరు ఓఎన్జీసీ ఉద్యోగులను రక్షించిన ఆర్మీ
ఓఎన్జీసీ| అసోంలో గత బుధవారం అపహరణకు గురైన ఓఎన్జీసీ ఉద్యోగుల్లో ఇద్దరిని భద్రత బలగాలు రక్షించాయి. శుక్రవారం రాత్రి ఇండియన్ ఆర్మీ, అసోం రైఫిల్స్ రెస్య్కూ ఆపరేషన్ ప్రారంభించాయి.

గువాహటి: అసోంలో గత బుధవారం అపహరణకు గురైన ఓఎన్జీసీ ఉద్యోగుల్లో ఇద్దరిని భద్రత బలగాలు రక్షించాయి. శుక్రవారం రాత్రి ఇండియన్ ఆర్మీ, అసోం రైఫిల్స్ సంయుక్తంగా గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఈ క్రమంలో నాగాలాండ్‌లోని మాన్ జిల్లాలో ఇద్దరు ఉద్యోగులను రక్షించారు. వారిని అలకేష్ సైకియా, మోహిని మోహన్ గొగోయిగా గుర్తించారు. మరో ఉద్యోగి కోసం గాలింపు కొనసాగుతున్నదని, ఘటన స్థలంలో ఏకే-47 రైఫిల్ లభించిందని, దానిని స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు.
గత బుధవారం తెల్లవారుజామున అసోంలోని శివసాగర్ జిల్లాలో లకువా ఫీల్డ్‌లోని రిగ్ సైట్ నుంచి ఓఎన్జీసీకి చెందిన ముగ్గురు ఉద్యోగులను సాయుధ దుండగులు ఎత్తుకెళ్లారు. వారిలో ఇద్దరు జూనియర్ ఇంజినీర్లు, ఒక జూనియర్ టెక్నీషియన్ ఉన్నారు. వారిని ఓఎన్జీసీకి చెందిన ఆపరేషనల్ వెహికిల్‌లో ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఆ వాహనాన్ని అసోం-నాగాలాండ్ సరిహద్దుల్లోని నిమోనగడ్ అటవీ ప్రాంతంలో వదిలివెళ్లారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
దేశంలో గుజరాత్ ఒక్కటే ఉందా?
ఎస్ఐని హతమార్చిన మావోయిస్టులు
కరోనా విధుల్లో కానిస్టేబుల్.. పోలీస్ స్టేషన్లోనే హల్దీ వేడుక
కరోనా ఎఫెక్ట్.. ఐఎన్ఐ సెట్ వాయిదావేసిన ఎయిమ్స్
దేశంలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 3.46లక్షల కేసులు
వైద్యారోగ్య శాఖకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు..
మూడు ప్రభుత్వ ఉద్యోగాలు గెలిచి..
శ్రీరామనవమి రోజు ఆదిపురుష్ లుక్ ఎందుకు రిలీజ్ కాలేదు..!
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- abduct
- Assam
- Assam Rifles
- employees
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

