Assembly Elections : జమ్ము కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్ ఈ నెలలో ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు. కశ్మీర్లో సానుకూల వాతావరణం నెలకొన్న నేపధ్యంలో ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలని ఈసీ కసరత్తు సాగిస్తోంది. ఆగస్ట్ ద్వితీయార్ధంలోగా ఎన్నికలను పూర్తి చేయాలని ఈసీ యోచిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో పెద్దసంఖ్యలో ప్రజలు పోలింగ్ ప్రక్రియలో పాల్గొనడం సానుకూల సంకేతంగా ఈసీ వర్గాలు భావిస్తున్నాయి.
ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసే చర్యల్లో భాగంగా ఈసీ పలు నిర్ణయాలు తీసుకుంటోంది. గుర్తింపు పొందని నమోదిత పార్టీలను వారు ఎంచుకునే ఎన్నికల చిహ్నాల కోసం దరఖాస్తు చేయాలని ఈసీ ఆహ్వానించింది. ఈ పార్టీలు ఉమ్మడి ఎన్నికల గుర్తుపై తమ అభ్యర్ధులను బరిలో దింపేందుకు వెసులుబాటు కల్పించేలా ఈ చర్యలు చేపట్టింది.
మరోవైపు ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లొ జమ్ము కశ్మీర్లో 58.58 శాతం పోలింగ్ నమోదు కావడం పట్ల ఈసీ సంతృప్తి వ్యక్తం చేస్తోంది. గత మూడు, నాలుగు దశాబ్ధాల్లో కశ్మీర్లో ఈ ఎన్నికలు ప్రశాంతంగా సాగడం కూడా అసెంబ్లీ ఎన్నికల కసరత్తును వేగవంతం చేసేందుకు ఈసీ సానుకూల చర్యలు చేపడుతోంది. ఇక జమ్ము కశ్మీర్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తామని ఇటీవల ఈసీ స్పష్టం చేసింది.
Read More :
Modi 3.0 | వంద రోజల యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ప్రధాని కోరారు : పెమ్మసాని చంద్రశేఖర్