Modi 3.0 : నరేంద్ర మోదీ క్యాబినెట్లో చేరనున్న టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ఆదివారం ఉదయం తన నివాసంలో కాబోయే మంత్రులకు ఇచ్చిన తేనీటి విందుకు పెమ్మసాని హాజరయ్యారు.
వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రధాని తమను కోరారని ఆయన వెల్లడించారు. మనం ఏం చేసినా ప్రజలు మనల్ని గమనిస్తూ ఉంటారని అందుకు అనుగుణంగా జాగ్రత్తగా నడుచుకోవాలని సూచించారని చెప్పారు.
ఇక రాష్ట్రపతి భవన్లో ఆదివారం సాయంత్రం 7.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ క్యాబినెట్లో తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మకు చోటు దక్కనుంది.
Read More :
Health Tips | పొద్దున లేవగానే పరగడుపున ఎన్ని నీళ్లు తాగాలి?