Congress MLA | ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వరుసగా కరెంటు కోతలతో (power cuts) విగుసు చెందిన ఓ ఎమ్మెల్యే.. ఏకంగా విద్యుత్ స్తంభం ఎక్కి విద్యుత్ శాఖకు చెందిన ముగ్గురు అధికారుల ఇళ్లకు కరెంటు సరఫరా నిలిపివేశారు.
జిల్లాలోని జాబ్రేడా (Jhabreda)కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA) వీరేంద్ర జాతి (Virendra Jaatii) ఈ చర్యకు పాల్పడ్డారు. ఆ ప్రాంతంలో వరుస విద్యుత్ కోతలపై ఎమ్మెల్యే తన మద్దతుదారులతో కలిసి నిరసన తెలిపారు. ఈ క్రమంలో విద్యుత్ స్తంభం ఎక్కి మొదట బోట్ క్లబ్‌లోని సూపరింటెండెంట్ ఇంజినీర్ వివేక్ రాజ్‌పుత్ అధికారిక నివాసానికి కనెక్షన్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత చీఫ్ ఇంజినీర్ అనుపమ్ సింగ్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వినోద్ పాండే అధికారిక నివాసాలకు కూడా కరెంట్ కనెక్షన్ కట్ చేశాడు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా నిరంతరం కరెంటు పోతోందన్నారు. రోజుకు 5 నుంచి ఆరు గంటలు పవర్ కట్ చేస్తున్నారన్నారు. దీంతో ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఘటనపై స్థానిక పోలీసు స్టేషన్లో ఎమ్మెల్యేపై కేసు నమోదైంది.
Also Read..
DK Shivakumar | పదవుల కంటే పార్టీ కార్యకర్తగా ఉండటమే ఇష్టం : డీకే శివకుమార్
Maoists encounter | గుమ్మా అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి