DK Shivakumar | కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం, పదవుల కంటే పార్టీ కార్యకర్తగా ఉండటమే (I want to remain a party worker) తనకు ఎంతో విలువనిస్తుందన్నారు. ‘అధికారం లేదా పదవి కంటే నేను పార్టీ కార్యకర్తగానే ఉండాలనుకుంటున్నాను. అది నాకు శాశ్వతం. అలా ఉండటమే నాకు ఇష్టం. నేను 1980 నుంచి పార్టీ కార్యకర్తగానే ఉన్నాను. గత 45 ఏండ్లుగా నిరంతరం పార్టీ కోసమే కష్టపడి పనిచేస్తున్నాను’ అని అన్నారు. ఢిల్లీలోని కర్ణాటక భవన్లో మీడియాతో మాట్లాడుతూ డీకే ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పదవికి సంబంధించి అధికార భాగస్వామ్య ఒప్పందం గురించి అడగ్గా.. ‘మా మధ్య ఏం చర్చలు జరిగాయో నేను వెల్లడించలేను. రాష్ట్రంలో మేము కలిసి ఓ బృందంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ఇందుకోసం పార్టీలోని ప్రతి కార్యకర్త తీవ్రంగా కృషి చేశారు. హైకమాండ్ మాకు స్వేచ్ఛనిచ్చింది. మాకు అండగా ఉంటున్న కర్ణాటక ప్రజలకు మేము రుణపడి ఉంటాము. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని డీకే వివరించారు.
Also Read..
PM Modi | కేథడ్రల్ చర్చిలో క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
Nitin Gadkari | హమాస్ నేత హనియా హత్య సమయంలో అక్కడే ఉన్నా.. ఆయన్ని కలిశా : నితిన్ గడ్కరీ
Indian Vlogger | భారత వ్లాగర్ను నిర్బంధించిన చైనా