Maoists encounter | గుమ్మా అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
గుమ్మా అటవీ ప్రాంతంలో బుధవారం భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు(Maoists) మరణించారు.
హైదరాబాద్ : ఒడిషా(Odisha) రాష్ట్రం కంధమాల్ జిల్లా బెల్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అటవీ ప్రాంతంలో బుధవారం భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు(Maoists) మరణించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుమ్మా అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారం మేరకు కోటగడ్లో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఎదురుపడిన మావోయిస్టులు.. భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు.
దీంతో ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో రాయగఢ్ ఏరియా కమిటీ సభ్యుడు, బారి అలియాస్ రాకేష్, మరొకరు అమృత్గా గుర్తించారు. సంఘటన స్థలంలో రెండు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, బారి తలపై రూ.22 లక్షల నగదు బహుమతి ప్రకటించగా, అమృత్ తలపై రూ.1.65 లక్షల రివార్డు ప్రకటించారని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని, మరిన్ని బలగాలను మోహరించామని ఏడీజీ (యాంటీ నక్సల్ ఆపరేషన్స్) సంజీబ్ పాండా తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

