Train derails | బీహార్లోని బెట్టియా (Bettiah)లో ఓ రైలు పట్టాలు తప్పింది (Train derails). ఆనంద్ విహార్ నుంచి దర్భంగా వెళ్తున్న ఎక్స్ప్రెస్ (Darbhanga Express) రైలు బగాహ పోలీస్ జిల్లా హరినగర్ స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. రైలులోని రెండు బోగీలు, ఇంజిన్ ఒక్కసారిగా పట్టాలు తప్పాయి. అయితే, ఈ ఘటనలో ప్రయాణికులకు (Passengers) ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
బుధవారం రాత్రి 12:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది. గుర్తు తెలియని వ్యక్తులు వాక్యూమ్ బ్రేక్ వేయడం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపింది. గోరఖ్పూర్ కాంట్ – నర్కతీయగంజ్ ప్యాసింజర్ రైలు ఏకంగా ఐదు గంటలు ఆలస్యమైంది. నార్కటియగంజ్ – గోరఖ్పూర్ సుమారు 10 గంటలు ఆలస్యంగా నడుస్తోంది.
Also Read..
Kasthuri | తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో నటి కస్తూరికి ఊరట
CAG | కాగ్ నూతన అధిపతిగా సంజయ్ మూర్తి ప్రమాణ స్వీకారం
PM Modi | మోదీకి అరుదైన గౌరవం.. అత్యున్నత పురస్కారాలతో సత్కరించిన డొమెనికా, గయానా