Chhattisgarh | రాయ్‌పూర్ : ఛత్తీస్‌గడ్‌లోని బీజాపూర్ జిల్లాలోని అడవులను పోలీసు బలగాలు జల్లెడ పడుతున్న సంగతి తెలిసిందే. మావోయిస్టులను మట్టుబెట్టడమే లక్ష్యంగా.. పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. వేలాది మంది పోలీసులు బీజాపూర్ జిల్లాలోని అడవులను తమ ఆధీనంలోకి తీసుకుని, మావోయిస్టుల కదలికలను పసిగడుతూ.. బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారు.
తాజాగా బీజాపూర్ జిల్లా అవపల్లి – బాసగూడ రోడ్డుపై మావోయిస్టులు మందుపాతరను అమర్చారు. హైవేపై ఓ సొరంగం తవ్వి.. పోలీసుల వాహనాలే లక్ష్యంగా ముందుపాతరను మావోయిస్టులు పాతిపెట్టారు. మందుపాతరను గుర్తించిన సీఆర్పీఎఫ్ సిబ్బంది, అత్యంత జాగ్రత్తగా దాన్ని నిర్వీర్యం చేశారు.
ఇక సుక్మా జిల్లాలో కూడా మరో డంప్‌ను భద్రతా బలగాలు కనుగొన్నాయి. జిల్లాలోని దుల్లేడ్, మెట్టుగూడ అటవీ ప్రాంతంలో 203 కోబ్రా బెటాలియన్, సీఆర్పీఎఫ్ 131 బెటాలియన్ సిబ్బంది కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో మెట్టుగూడ గ్రామం నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక గుహను కనుపెట్టారు. అందులో పరిశీలించగా 21 ఐఈడీలు, మల్టీ బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ (BGL), ఒక జనరేటర్ సెట్, లాత్ మెషిన్ పరికరాలు, భారీ మొత్తంలో పేలుడు తయారీ పదార్థాలు, తుపాకీ తయారీ పరికరాలు, వైద్య సామాగ్రి ఉన్నాయి. భద్రతా బలగాలు భారీ ఆయుధ డంప్‌ను స్వాధీనం చేసుకోవడంతో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగినట్లయింది.
#WATCH | Chhattisgarh: An IED planted by naxals, was defused by security officials in Bijapur. The 50 kg IED was planted by naxals on Awapalli-Basaguda road: Bijapur Police
(Source: Bijapur Police) pic.twitter.com/K4Aom1hgml
— ANI (@ANI) January 23, 2025
ఇవి కూడా చదవండి..
Watch: 200 మంది పోలీసుల భద్రత మధ్య.. గుర్రంపై ఊరేగిన దళిత వరుడు, ఎందుకంటే?
iPhone Issues: ఐఫోన్ పర్ఫార్మెన్స్లో సమస్యలు.. యాపిల్ సంస్థకు కేంద్రం నోటీసులు
Vasectomy | భార్యకు బహుమతిగా.. సొంతంగా వేసెక్టమీ ఆపరేషన్ చేసుకున్న భర్త.. Video