Vasectomy | ఒకరిద్దరూ సంతానం కలిగిన తర్వాత చాలా మంది దంపతులు ఇక తమకు పిల్లలు వద్దనుకుంటారు. అలా అనుకునే వారు.. తక్షణమే భార్యకు ట్యూబెక్టమీ ఆరేషన్ చేయించేందుకు సిద్ధమైపోతారు. అయితే పురుషులు కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు(వేసెక్టమీ) చేయించుకోవచ్చు. కానీ వేసెక్టమీ ఆపరేషన్లకు పురుషులు దూరంగా ఉంటున్నారు. ఎక్కడో ఒక చోట పురుషులు వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటున్నారు.
అయితే వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకునేందుకు డాక్టర్లను సంప్రదిస్తారు. కానీ ఓ పురుషుడు స్వయంగా తనకు తానే వేసెక్టమీ ఆపరేషన్ చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇది తన భార్యకు బహుమతి అని ఆ పురుష డాక్టర్ చెప్పుకొచ్చారు. తన వేసెక్టమీ ఆపరేషన్‌ను వీడియోగా చిత్రీకరించి.. సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
చైనాకు చెందిన చెన్ వీ నాంగ్ వృత్తిరీత్యా వైద్యుడు. ప్లాస్టిక్ సర్జరీలు చేయడంలో దిట్ట. సొంత ఆస్పత్రి కూడా ఉంది. ఇక నాంగ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మరో బిడ్డ అవసరం లేదని నిర్ణయించుకున్నారు ఆ దంపతులు. అందరిలాగే భార్యకు ట్యూబెక్టమీ సర్జరీ చేయించకుండా.. తానే వేసెక్టమీ ఆపరేషన్ చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. తన భార్యను సంతోషంగా ఉంచేందుకు ఈ సర్జరీకి అతను పూనుకున్నాడు. ఇక తన క్లినిక్‌లోనే వేసెక్టమీ ఆపరేషన్‌ను సొంతంగా చేసుకున్నాడు. సాధారణంగా 15 నిమిషాల్లో పూర్తయ్యే ఈ శస్త్రచికిత్సకు గంట సమయం పట్టింది. ఎందుకంటే సొంతంగా చేసుకోవడం కారణంగా. వేసెక్టమీ ఆపరేషన్లపై అవగాహన పెరగాలనే ఉద్దేశంతో.. ఆ సర్జరీ విధానాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు వీ నాంగ్.
ప్రస్తుతం వీ నాంగ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. వేసెక్టమీ ఆపరేషన్ విజయవంతం అయిందని తెలిపాడు. తనను తాను స్టెరిలైజ్ చేసుకోవడం చాలా విచిత్రమైన అనుభవం అని తెలిపాడు. మహిళలకు స్టెరిలైజేషన్ అనేది మరింత సంక్లిష్టమైన ప్రక్రియ అయినప్పటికీ, పురుషులలో ఇది చాలా ఈజీగా ఉంటుందని వీ నాంగ్ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి..
Donald Trump: అమెరికాలో వేల సంఖ్యలో ఉగ్రవాదులు: ట్రంప్
Mount Everest: ఎవరెస్ట్ అధిరోహకులకు షాక్.. ఫీజు పెంచేసిన నేపాల్ సర్కార్