Donald Trump | అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన 20వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన భార్య, అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ (Melania Trump)కు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో త్రోబ్యాక్ వెడ్డింగ్ ఫొటో (throwback wedding pic)ను షేర్ చేశారు.
Happy 20th Anniversary to Melania! pic.twitter.com/VIcXSQb4QO
— Donald J. Trump (@realDonaldTrump) January 22, 2025
‘నా అందమైన భార్య మెలానియాకు 20వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు’ అంటూ ట్రంప్ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు తమ పెళ్లినాటి ఫొటోను జతచేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇది చూసిన పలువురు ప్రముఖులు, నెటిజన్లు ట్రంప్-మెలానియా దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Celebrating 20 years with my beautiful wife and our incredible First Lady, Melania. You’re an extraordinary wife and a wonderful mother.
Happy Anniversary, @FLOTUS! pic.twitter.com/BPTfeGpA7x
— President Donald J. Trump (@POTUS) January 22, 2025
డొనాల్డ్ ట్రంప్‌కు మొత్తం ముగ్గురు భార్యలు అన్న విషయం తెలిసిందే. తొలుత 1990లో చెక్ రిపబ్లిక్కు చెందిన అథ్లెట్, మోడల్ ఇవానా జెల్నికోవాను ట్రంప్ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు డొనాల్డ్ జూనియర్, ఇవాంకా, ఎరిక్ జన్మించారు. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 1999లో నటి మార్లా మాపిల్స్‌ను ట్రంప్ మనువాడారు. వీరికి టిఫానీ జన్మించింది. ఆ తర్వాత మార్లాతో విడాకులు తీసుకున్న ట్రంప్.. 2005లో స్లొవేనియా మాజీ మోడల్ అయిన మెలానియాను వివాహం చేసుకున్నారు. వీరికి బారన్ విలియం ట్రంప్ అనే కుమారుడు ఉన్నాడు.
1998లో ఓ పార్టీలో కలుసుకున్న వీరు మంచి స్నేహితులయ్యారు. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో 2005లో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో గల ఎపిస్కోపల్ చర్చ్ ఆఫ్ బెథెప్డా – బైది-సీలో అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహానికి 350 మంది అథితులు హాజరయ్యారు. వివాహం అనంతరం ట్రంప్ ఎస్టేట్ మార్-ఎ-లాగోలో గ్రాండ్ రిసెప్షన్ జరిగింది.
Also Read..
America | జన్మతః పౌరసత్వం రద్దుపై న్యాయపోరు.. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై అమెరికాలో తీవ్ర వ్యతిరేకత
Gulf Coast | అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం.. 2,200 విమాన సర్వీసులు రద్దు
Donald Trump | వారందరినీ సెలవులో ఉంచండి.. ట్రంప్ మరో సంచలన నిర్ణయం