Gulf Coast | అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం.. 2,200 విమాన సర్వీసులు రద్దు
మంచు తుఫాన్లు టెక్సాస్ నుంచి న్యూయార్క్ వరకు ‘గల్ఫ్ కోస్ట్'గా పేర్కొనే ప్రాంతాన్ని గజగజ వణికిస్తున్నాయి. భారీగా కురుస్తున్న మంచు.. ఎముకలు కొరికే చలి అమెరికా దక్షిణ రాష్ర్టాలను చుట్టుముట్టాయి. ఇప్పటివరకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా వ్యాప్తంగా 2,200కుపైగా విమాన సర్వీసులను రద్దు చేశారని, 3 వేలకుపైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు వెల్లడించారు.
- నలుగురు మృతి..
Gulf Coast | వాషింగ్టన్, జనవరి 22: మంచు తుఫాన్లు టెక్సాస్ నుంచి న్యూయార్క్ వరకు ‘గల్ఫ్ కోస్ట్’గా పేర్కొనే ప్రాంతాన్ని గజగజ వణికిస్తున్నాయి. భారీగా కురుస్తున్న మంచు.. ఎముకలు కొరికే చలి అమెరికా దక్షిణ రాష్ర్టాలను చుట్టుముట్టాయి. ఇప్పటివరకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా వ్యాప్తంగా 2,200కుపైగా విమాన సర్వీసులను రద్దు చేశారని, 3 వేలకుపైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు వెల్లడించారు.
లూసియానా, టెక్సాస్ రాష్ర్టాల్లో విమానాశ్రయాలు, జాతీయ రహదారుల్ని మూసేశారు. మంగళవారం న్యూయార్క్ నగరంలో పలు చోట్ల 18 అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. దీంతో పలు కౌంటీల్లో న్యూయార్క్ గవర్నర్ ఎమర్జెన్సీ విధించారు. న్యూ ఓర్లియాన్స్, ఫ్లోరిడా పెన్సాకోలాలో రికార్డ్‌స్థాయిలో 6.5 అంగుళాల మేర మంచు కురిసింది. కెనడాలో కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు మైనస్ 50 డిగ్రీలకు పడిపోయాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

