Donald Trump | రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ఫెడరల్ ప్రభుత్వానికి చెందిన డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ (DEI) సిబ్బందికి లేఆఫ్‌లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ఆ విభాగాల సిబ్బంది అందరినీ సెలవులో ఉంచాలని ఆదేశించారు. ఈ ఆదేశాలతో ట్రంప్ కార్యవర్గం ఉత్తర్వులు జారీ చేసింది.
బుధవారం సాయంత్రం 5 గంటల్లోపు వారందరినీ వేతనంతో కూడిన సెలవుపై పంపించాలని సంబంధిత ఏజెన్సీలకు ఆదేశాలు అందాయి. ఈ విభాగాలకు చెందిన అన్ని వెబ్ పేజీలను కూడా ఈ గడువులోగా పూర్తిగా తొలగించాలని ఉత్తర్వుల్లో ట్రంప్ కార్యవర్గం స్పష్టం చేసింది. అంతేకాకుండా డీఈఐ సంబంధిత శిక్షణ కార్యక్రమాలను కూడా తక్షణమే ముగించాలని ఏజెన్సీలకు సూచించింది. ఈ విభాగాలు చేసుకున్న ఒప్పందాలను కూడా క్యాన్సిల్ చేయాలని ఆదేశించారు. దీంతో ఇప్పటికే కొన్ని వెబ్ సైట్లను అధికారులు తొలగించారు.
కాగా, ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. శ్వేతసౌధంలోకి అడుగుపెట్టిన వెంటనే షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే గత అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన 78 ఆదేశాలను రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు. అంతేకాదు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఉపసంహరణ, క్యాపిటల్ హిల్‌పై దాడి కేసులో 1600 మంది మద్దతుదారులకు క్షమాభిక్ష, జన్మతః పౌరసత్వంపై (birthright citizenship) వేటు వంటి వందకు పైగా అంశాలకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు.
Also Read..
Illegal Migrants | ట్రంప్ నిర్ణయంతో అప్రమత్తమైన భారత్.. వారిని వెనక్కి రప్పించే యోచనలో కేంద్రం..!
Birthright Citizenship: జన్మతః పౌరసత్వం రద్దుపై భారత సంతతి చట్టసభ ప్రతినిధుల ఆందోళన
Donald Trump: చైనా దిగుమతులపై 10 శాతం పన్ను విధించనున్న అమెరికా